• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియమైన రియాన్.. నిన్ను...

ప్రియమైన రియాన్.. నిన్ను ఒంటరి చేయను.. జెనీలియా

By - Tupaki Desk
Update: 2021-11-27 23:30 GMT
బొమ్మరిల్లు సినిమాతో సుపరిచితం అయిన జెనీలియా పరిచయం అక్కర్లేని పేరు. రెడీ, ఢీ, ఆరెంజ్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. హాసినిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. కెరీర్ లో మంచి పొజీషన్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తెర మీద కనిపించకపోయినా కూడా సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటోంది. తనదైన ఫ్యామిలీ లైఫ్ తో అభిమానుల్ని ఉత్సాహపరుస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈమె పలు బిజినెస్ లను చూసుకుంటోంది. వారికి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఇద్దరు పిల్లలను పెంచుతోంది. ఇక అప్పుడప్పుడు పిల్లల ఫొటోలను, ఫ్యామిలీ టైంను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జెనీలియా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

జెనీలియా పెద్ద కుమారుడు రియాన్ పుట్టినరోజు. ఏడో పుట్టినరోజు సందర్బంగా రియాన్ క్యూట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు జెనీలియా. అంతేకాకుండా ఓ మాంచి సందేశంలాటి పుట్టినరోజు విషెస్ ను రాసుకొచ్చారు. ప్రియమైన రియాన్.. నీ కోరికలన్నీ నెరవేర్చడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తాను. నీ చిట్టిబుర్రలోని బోలెడన్నీ ఆశలను కచ్చితంగా నెరవేర్చుతానని నీ పుట్టినరోజునాడు మాటిస్తున్నాను. అయితే ఆకాశంలోకి ఎగరాలనుకున్నప్పుడు నీకు రెక్కలా కాలేను కానీ... ఆ రెక్కల కింద ఉండే గాలిని అవుతాను. ఇక అన్నింట్లో నువ్వు మొదటిస్థానంలో ఉండాలని కోరుకోను. నువ్వు చివరి స్థానంలో ఉన్నా కూడా ఏమాత్రం నిరాశపడకుండా నీలోని ప్రత్యేకతలను గుర్తిస్తాను. నా ఊపిరి ఉన్నంతవరకు నీ వెన్నంటే ఉంటాను. నిన్ను ఎప్పుడూ ఒంటరి చేయను. పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ బ్రేవ్ బాయ్.. అంటూ జెనీలియా భావోద్వేగంతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

జెనీలియా పోస్టుకు సామాజిక మాధ్యమాల్లో విపరీత స్పందన వస్తోంది. ఒక తల్లిగా పిల్లలకు చేయాల్సింది ఇంతకు మించి ఏం ఉండదని నెటిజన్లు అంటున్నారు. తల్లి పిల్లల గురించి ఈ విధంగా ఆలోచించాలి... జెనీలియా అమ్మగా పర్ పెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే రియాన్ పుట్టినరోజు సందర్బంగా పలువురు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    
  • Genelia D Souza 
  • Riteish Deshmukh 
  • Riaan Deshmukh 
  • Rahyl Deshmukh 
  • Genelia D Souza movies 
  • Genelia D Souzaimages 
  • Genelia D Souza new post 

Similar News

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

Copyright @2026

Powered by Blink CMS