హ..హ హాసిని రీఎంట్రీ లేట్ అవడానికి కారణం అదేనా...?
ఒకప్పుడు దక్షణాది చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి జెనీలియాన డిసౌజా. 'నువ్వేకావాలి' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేసిన 'తుజే మేరీ కసమ్' సినిమా ద్వారా జెనీలియా కెరీర్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోల సరసన నటించి పలు విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతో పాటు హిందీ తమిళ్లోనూ అల్లరి పిల్లగా.. క్యూట్ హీరోయిన్ గా జెనీలియా పలు చిత్రాల్లో నటించింది. 'బొమ్మరిల్లు'లో హహ హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఇక 'సత్యం' 'సాంబ'.. 'ఆరెంజ్'.. 'సై'.. 'సుభాష్ చంద్రబోస్' 'ఢీ' 'రెడీ' వంటి చాలా సినిమాలు చేసింది ఈ భామ. తన తొలి సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశ్‌ముఖ్ ను 2012లో వివాహమాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చివరగా తెలుగులో చేసిన సినిమా 'నా ఇష్టం'. 11 ఏళ్ళ సినీ ప్రయాణంలో జెనెలీయో బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎన్నో చిత్రాల్లో నటించిన జెనీలియా మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత వరకు ఆమెఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ఆమె ఇన్ని రోజులు సినిమాల్లో మళ్ళీ నటించకపోవడానికి కారణం పిల్లలు అనే తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యం లో లైవ్ సెషన్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వారి విశేషాలను తెలియజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మన 'హహ హాసిని' జెనీలియా కూడా టిక్ టాక్ ద్వారా డైన్ విత్ మీ అంటూ ఫ్యాన్స్ తో లైవ్ చిట్ చాట్ చేసింది. ఈ లైవ్ సెషన్ ద్వారా తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా తను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని.. కానీ తన ఇద్దరు పిల్లలు ఇంకా చాలా చిన్నవారు కావడం వలన వారి ఆలనాపాలనా చూసుకోడానికి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశ్యంతో సినిమాల్లో రీఎంట్రీ లేట్ అవుతోందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన హస్బెండ్ రితేష్ తో కలిసి మరాఠీ సినిమాలో చేయాలని ఉందని తెలిపింది. ఏదేమైనా జెనీలియా త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉందని మాత్రం క్లారిటీ వచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెనీలియాను త్వరలో మళ్ళీ వెండి తెరపై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.