టూ డేస్ గోవిందం కలెక్షన్స్ కెవ్వు కేక!

Update: 2018-08-17 11:32 GMT
మొదటి రోజునుండే సత్తా చాటుతున్న విజయ్ దేవరకొండ 'గీతగోవిందం' రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేసింది.  మొదటి రోజు ఏపీ-తెలంగాణాల్లో రూ. 5.44 కోట్ల షేర్ వసూలు చేసిన 'గీత గోవిందం' రెండో రోజు రూ. 3.85 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. 

మొదటి రోజుతో పోలిస్తే ఇది జస్ట్ 25% మాత్రమే డ్రాప్.  మొదటి రోజు ఇండిపెండెన్స్ డే.. పబ్లిక్ హాలిడే కావడంతో కలెక్షన్స్ మామూలు రోజులకంటే కాస్త ఎక్కువగానే ఉంటాయి.  నిన్న వర్కింగ్ డే కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవచ్చు.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్ షుమారుగా రూ. 9.25 కోట్లు.  ఈరోజు నైజాం ఏరియా లో 40 స్క్రీన్స్ అదనంగా యాడ్ చేయడం జరిగిందట. దీన్ని బట్టి వీకెండ్ లో కలెక్షన్స్ మరికొంత పెరిగే అవకాశం ఉంది.

ఇక ఏరియా వైజ్ షేర్స్ చూద్దాం.  అన్నీ రూపాయలే.

నైజాం            3.10 cr
సీడెడ్            1.60 cr
ఉత్తరాంధ్ర        1.00 cr
ఈస్ట్              0.81 cr
వెస్ట్              0.69 cr
కృష్ణ              0.79 cr
గుంటూరు       0.91 cr
నెల్లూరు         0.35 cr

టోటల్          9.25 కోట్లు

ఇదిలా ఉంటే మొదటి రోజే సినిమా బ్రేక్ ఈవెన్ లోకి రాగా రెండో రోజునుండే లాభాలు తీసుకొస్తున్నాడట మన గోవిందం. ఇక మన బన్నీ వాస్ 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అని పాడుకుంటూ బ్యాంక్ కి  వెళ్తాడేమో.. సారీ.. అంతా ఆన్లైన్ బ్యాంకింగ్ కదా.. ఎకౌంట్ లోకి లాగిన్ కి కలెక్షన్ లెక్కలు చూసుకుంటాడేమో!


Tags:    

Similar News