అప్పుడే 10 కోట్లు పెట్టేస్తున్నారా?

Update: 2018-01-17 06:47 GMT
మన యువ హీరోలు ఈ మధ్య కాలంలో మొదటి అడుగులోనే కొత్త ప్రయత్నాలు చేసి రిజల్ట్ తో సంబంధం లేకుండా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొడితే సిక్స్ లేకుంటే ఫోర్ అనే ఆలోచనతో సినిమాలను తీసి టాలీవుడ్ స్టార్ టీమ్ లలో అవకాశాలను అందుకుంటున్నారు. మొన్నటి వరకు మినీ ప్రొడక్షన్ లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విజయ్ మార్కెట్ ఇప్పుడు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం విజయ్ చేస్తోన్న చిత్రాల్లో భారీగా తెరకెక్కుతోన్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది గీతా ఆర్ట్స్ లో రూపొందుతోన్న సినిమానే. ఇంతకుముందు  విజయ్ చేసిన సినిమాలు 3 కోట్ల లోపు తెరకెక్కిన సినిమాలే. ఆ సినిమాలు ఇటు నిర్మాతలకి అటు బయ్యర్లకు మంచి లబాలను అందించాయి. దీంతో నిర్మాత అల్లు అరవింద్ విజయ్ దేవరకొండ సినిమాను దాదాపు 10 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథగా పరశురాం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతా గోవిందం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

గీతా ఆర్ట్స్ లో ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ హీరోలు అల్లు అర్జున్ - రామ్ చరణ్ సినిమాలు భారీగా నిర్మించబడ్డాయి. అందులో చాలా వరకు విజయాన్ని అందుకున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ తరువాత విజయ్ దేవరకొండ కూడా ఈ బ్యానర్లో ఒక మంచి హిట్ కొట్టి స్టార్ హీరోల సరసన నిలవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ కి ఏ స్థాయిలో విజయాన్ని ఇస్తుందో చూడాలి. అలాగే గీతా ఆర్ట్స్ వారు 10 కోట్లు పెట్టడం అనేది కూడా ఎంతవరకు కరక్టు తెలియాలంటే.. రిలీజ్ వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News