మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌

Update: 2021-04-19 08:51 GMT
బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ తాజా చిత్రం 'గంగూబాయి కతియావాడి' కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ ను మొదలు పెట్టినప్పటి నుండి ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ సినీ ప్రేమికులు వెయిట్‌ చేస్తున్నారు. గంగూబాయి గా ఆలియా భట్ నటన విశ్వరూపం చూపించబోతున్నట్లుగా టీజర్ మరియు ట్రైలర్ తోనే తేలిపోయింది. అంతటి క్రేజ్ ఉన్న గంగూబాయి సినిమాను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున జులై 30న విడుదల చేయాలనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఒక వేళ థియేటర్‌ లో వచ్చినా కూడా నిరాశ తప్పదని యూనిట్‌ మెంబర్స్ భావిస్తున్నారు.

గంగూబాయ్‌ సినిమా విడుదలకు ముంబయి లో పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. మొత్తం ఉత్తర భారతం అంతా కూడా ఇప్పుడు కరోనా తో విలవిలాడుతోంది. సాదారణ పరిస్థుతులు వచ్చేందుకు కనీసం ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. కనుక గంగూబాయి సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారట. సినిమా కు వచ్చిన బజ్‌ నేపథ్యంలో సినిమా ప్రముఖ ఓటీటీలు ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి.

పెట్టుబడిని మించి ఓటీటీ రైట్స్ ద్వారా నిర్మాతలు దక్కించుకనే అవకాశం ఉందంటున్నారు. సేఫ్‌ ప్రాజెక్ట్‌ మరియు లాభదాయకమైన డీల్ కనుక ఈ సినిమాను ఓటీటీ విడుదలకు అభ్యంతరం లేదని నిర్మాతలు నిర్ణయానికి వచ్చారట. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతుకు ముందు ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది అనే విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆలియా భట్‌ ప్రస్తుతం తెలుగులో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో కూడా చరణ్‌ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సక్సెస్‌ అయితే ఆర్‌ ఆర్‌ ఆర్‌ లోని ఆమె పాత్ర కోసం ఉత్తరాది అభిమానులు మరింత ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తారని అంటున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా అక్టోబర్‌ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News