• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గంగూబాయి' టీజర్:...

'గంగూబాయి' టీజర్: కామటీపురం రాణిగా ఎదిగిన సెక్స్ వర్కర్ కథ..!

By - Tupaki Desk
Update: 2021-04-09 06:00 GMT
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ''గంగూబాయి కతియావాడీ''. ఇప్పటికే విడులైన ప్రచార చిత్రాల్లో ఆలియా స్టన్నింగ్‌ లుక్‌ తో ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమా హిందీ టీజర్ ను రిలీజ్ చేయగా విశేష స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో జులై 30న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'గంగుబాయి' తెలుగు టీజర్ ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

''కామటీపురంలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదు అంటారు.. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది'' అనే వాయిస్ ఓవర్ తో 'గంగూబాయి కతియావాడీ' టీజర్ ప్రారంభమైంది. సంజయ్‌ లీలా భన్సాలీ మరోసారి బలమైన స్టోరీతో తనదైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని అలరించబోతున్నాడని టీజర్ తోనే అర్థం అవుతోంది. అనుకోని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్ గా మారిన గంగూబాయి తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని 'మేడమ్ ఆఫ్‌ కామతిపుర'గా రాణిగా ఎలా మారింది.. ఆ తర్వాత కాలంలో సెక్స్‌ వర్కర్ల హక్కుల కోసం ఎలా పోరాడింది అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. పవర్ ఫుల్ గంగుబాయి పాత్రను అలియా ఛాలెంజింగ్ గా తీసుకుని పోషించినట్లు తెలుస్తోంది.

'గంగూబాయి కతియావాడి' మూవీ హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్‌ దేవగణ్‌ - ఇమ్రాన్ హష్మి - హ్యూమా ఖురేషి ఇందులో కీలక పాత్రల్లో నటించారని సమాచారం. ఈ చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సంజయ్ లీలా భన్సాలీ - జయంతి లాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
Full View
Tags:    
  • Gangubai Kathiawadi 
  • Gangubai Kathiawadi Telugu Teaser 
  • Tollywood 
  • Telugu News 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS