• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగ‌స్టులోనే గ్యాంగ్...

ఆగ‌స్టులోనే గ్యాంగ్ లీడ‌ర్‌ ప్ర‌మోష‌న్స్

By - Tupaki Desk
Update: 2019-07-22 10:15 GMT
మంచి రిలీజ్ తేదీ.. స‌రైన‌ ప‌బ్లిసిటీ సినిమాల‌కు చాలా ఇంపార్టెంట్. థియేట‌ర్ల‌లో ఫ‌లానా సినిమా ఆడుతోంద‌ని జ‌నాల‌కు తెలియ‌క‌పోతే ఎంత గొప్ప సినిమా తీసినా వృధానే. అందుకే ఆ రెండు విష‌యాల్లో హీరోలు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. పోటీ లేకుండా రిలీజ్ చేసేందుకు.. ప్ర‌చారంతో దూసుకెళ్లేందుకు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలతో క్లాషెస్ రాకుండా చూసుకోవ‌డం అంతే కీల‌కంగా మారుతోంది.

ఇటీవ‌లే `సాహో` రిలీజ్ వాయిదా అన‌గానే ఓ రెండు సినిమాల‌కు క‌లిసొచ్చింది. అదే వాయిదా వేరొక సినిమాని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. శ‌ర్వా న‌టించిన ర‌ణ‌రంగం.. అడివి శేష్ న‌టించిన `ఎవ‌రు` చిత్రాల‌కు `సాహో` వాయిదా ప్ల‌స్ అయ్యింది. అటు బాలీవుడ్ లోనూ మ‌రో రెండు భారీ చిత్రాల‌కు పెద్ద రిలీఫ్ ద‌క్కింది. అయితే `సాహో` వాయిదా వ‌ల్ల ప్ర‌ధానంగా దెబ్బ ప‌డింది నాని `గ్యాంగ్ లీడ‌ర్`కే. ఆ సినిమాని ఆగ‌స్టు 30న రిలీజ్ చేస్తున్నామ‌ని నాని స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌క‌టించారు. అయితే సాహో చిత్రాన్ని ఆగ‌స్టు 15 నుంచి 30వ తేదీకి వాయిదా వేయ‌డంతో ఇప్పుడు నాని సినిమా వాయిదా త‌ప్ప‌డం లేదట‌.
 
సెప్టెంబ‌ర్ కి `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రాన్ని వాయిదా వేస్తున్నార‌ట‌. అందుకే ఇటీవ‌ల నాని టీమ్ ప్ర‌చారం విష‌యంలో చ‌డీచ‌ప్పుడు చేయ‌డం లేదు. ఫ‌లానా తేదీ అని ఫిక్స్ చేయ‌గానే ప్ర‌మోష‌న్ ప్రారంభించ‌నున్నారు. ఇటీవ‌లే గ్యాంగ్ లీడ‌ర్ నుంచి `రా రా` థీమ్ సాంగ్ రిలీజై ఆక‌ట్టుకుంది. అనిరుధ్ మార్క్ మ్యూజిక్ అల‌రించింది. విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది.

    
    
    

Tags:    
  • Gang Leader 
  • nani 
  • Nani Gang Leader 
  • Latest News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS