• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జూనియర్ గాలి.. సినిమా...

జూనియర్ గాలి.. సినిమా హీరో!

By - Tupaki Desk
Update: 2017-06-05 09:36 GMT
సినీ రంగానికి చెందిన వాళ్లే కాదు.. ఈ మధ్య రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల వారసులు సినీ అరంగేట్రం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ‘జయదేవ్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పి.. ఆపై కేసుల్లో చిక్కుకుని బెయిల్ మీద బయటికి వచ్చిన అపర కుబేరుడు గాలి జనార్దనరెడ్డి కూడా తన కొడుకు కిరీటి రెడ్డిని సినీ హీరోగా పరిచయం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మధ్య గాలి కూతురి పెళ్లి చేసినపుడు కిరీటి బాగానే హైలైట్ అయ్యాడు. పెళ్లి ఆహ్వానం కోసం రూపొందించిన వీడియోలో కనిపించిన కిరీటి.. ఆపై పెళ్లి వేడుకలో డ్యాన్సులతో అదరగొట్టినట్లు అతిథులు చెప్పుకున్నారు.

ఆ సమయంలోనే కిరీటికి సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి కొందరు సినీ ప్రముఖలతో చర్చించాడట గాలి. సినిమాల విషయంలో కిరీటి చాలా పట్టుదల ఉండటంతో గాలి కాదనలేకపోయాడట. సొంతంగా బేనర్ పెట్టి అతడిని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడని.. ఇందుకోసం కొందరు తెలుగు దర్శకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడని.. టాలీవుడ్లోనే కిరీటిని హీరోగా పరిచయం చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది జనవరికి కిరీటి తొలి సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చని అంటున్నారు. మరి కిరీటి తెరంగేట్రం జస్ట్ రూమరో.. లేక వాస్తవమో కొన్ని రోజుల్లో తేలిపోయే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gali Janardhan Reddy Son 
  • Gali Kireeti Reddy 
  • Film Industry 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS