అక్క‌డ‌ అంతా క‌ల్పితం అంటూ నిజం చెప్పిన న‌టి!

Update: 2021-02-10 12:30 GMT
కంటికి క‌నిపించేదేదీ నిజం కాదు.. న‌మ్మొద్దు!! అంటూ నిజం మాట్లాడింది యువ‌క‌థానాయిక ఆల‌య ఫ‌ర్నిచ‌ర్ వాలా(23). ప్ర‌ముఖ న‌టి పూజా భేడీ న‌ట‌వార‌సురాలిగా ఈ బాలీవుడ్ భామ సుప‌రిచితం. నేటిత‌రం న‌ట‌వార‌సురాళ్ల‌తో పోటీప‌డుతున్న‌ ఆల‌య  సామాజిక మాధ్య‌మాల్లో గొప్ప‌గా హొయ‌లు పోయే భామ‌లు ఆ ఫోటోషూట్ల కోసం ఎంత‌గా త‌పిస్తారో ప‌ర్ఫెక్ష‌న్ రాకపోతే ఎన్ని పాట్లు ప‌డ‌తారో కూడా త‌న‌దైన శైలిలో వెల్ల‌డించింది. ఈ వేదిక‌పై అంతా క‌ల్పితం!! అంటూ సామాజిక మాధ్య‌మాల గుట్టును కూడా బ‌య‌ట పెట్టేసింది ఈ యువ‌క‌థానాయిక‌.

న‌వ‌త‌రం నాయిక‌ల్లో ప్ర‌తిభావ‌నిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల‌య వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ఈ భామ బోలెడంత ఛ‌మ‌త్కారం ప్ర‌ద‌ర్శిస్తూ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ ప్రస్తుతం గోవాలో ఉంది. అంతేకాదు ఈత కొలనులోకి డైవింగ్ చేయడానికి ఏం చేస్తోందో చూశారు క‌దా?

``ఈ షాట్ రాకముందే ఎన్ని స్క్రాప్డ్ షాట్స్ ఎదుర్కొన్నానో.. మోకాలు నొప్పి పెట్టేలా విఫల ప్రయత్నాలు చేశానో మీకు చెప్పాలనుకుంటున్నాను`` అని అలయ అన్నారు. ఇన్ ‌స్టా వేదిక‌పై అభిమానులు కోరుకునే పరిపూర్ణతను తీసుకురావడానికి తాను చాలా రీటేక్ లు చేశానని ఆల‌య అంగీకరించింది.

నిజానికి సోష‌ల్ మీడియాలో ప్ర‌తిదీ చూపించ‌లేం. ఈ వేదిక‌పై గొప్ప ఎలివేష‌న్ ఉండేవే షేర్ చేస్తామ‌ని.. జీవితంలోని అన్ని వికారాలను దాచిపెడతామని తెలిపింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. త‌న‌ని ప‌రిశీలిస్తే... వెనుకభాగం విల్లు లాగా వొంగి ఉంది. దాదాపుగా పరిపూర్ణంగా కనిపిస్తోంది! ఈ ఫోటో ల‌క్ష వ్యూస్ వైపు దూసుకెళుతోంది. ఆల‌య ఇంత‌కుముందు షేర్ చేసిన ఫ‌న్నీ వీడియోలు ఫోటోలు అంత‌ర్జాలంలో జోరుగానే వైర‌ల్ అయ్యాయి.
Tags:    

Similar News