ఆర్ ఆర్ ఆర్ కథలో అసలు గుట్టు

Update: 2019-03-14 08:40 GMT
తన సినిమాలో ఏ కథ ఉంటుందో ముందే ధైర్యంగా గుట్టు విప్పే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విషయంలో సైతం వెనుకడుగు వేయలేదు. ఇద్దరు అగ్ర హీరోల మల్టీ స్టారర్ అయినా ఏదో ఒక రూపంలో వచ్చే లీకుల కన్నా తానే ధైర్యంగా చెప్పుకోవడం మేలని తలచి మొత్తంగా ఓపెన్ అయిపోయాడు.

చాలా స్పష్టంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తారని రాజమౌళి చెప్పేశాడు. అయితే చరిత్రలో ఈ ఇద్దరు కలవలేదు. కానీ ఆర్ ఆర్ ఆర్ లో కలుస్తారు. అందుకే దీన్ని జక్కన్న హిస్టారికల్ ఫిక్షన్ అంటున్నాడు. అంటే చరిత్రను టచ్ చేస్తూ ఎక్కువ కల్పనను జోడించడం. దీన్ని బట్టి చరణ్ రామ్ రాజుని తారక్ కొమరం భీంని తరహా వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు తప్ప నిజంగా వాళ్ళ కథలే అయితే ఇవి బయోపిక్స్ అవుతాయి

యుక్తవయసుకు వచ్చిన రామరాజు కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. తనకోసం ఎదురు చూస్తూ ప్రాణాలు పెట్టుకున్న మరదలు సీతను కాదని ఉద్యయం వైపు అడుగులు వేసి విప్లవ వీరుడిగా మారతాడు. ఇదే తరహాలో 1901లో పుట్టిన కొమరం భీం నిజామ్ పాలనను ఎండగట్టిన వీరుడు. ఈ ఇద్దరూ గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన వారు. ఇప్పుడీ లక్షణాలనే రాజమౌళి తన హీరోలకు ఆపాదించి వెండితెరపై కలపబోతున్నాడు.

మోటార్ సైకిల్ డైరీస్ అనే ఇంగ్లీష్ సినిమాలో చేగువేరా పాత్ర తాలూకు చిత్రణ తనకు విశేషంగా ఆకట్టుకుందని ఆర్ ఆర్ ఆర్ లో అలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చే హింట్ ఇన్ డైరెక్ట్ గా ఇచ్చేశాడు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ కథకు సంబంధించి చాలా మబ్బులు వీడిపోయాయి. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఏ స్థాయిలో పోరాటలు చేయబోతున్నారో ఊహించుకుంటేనే అభిమానులకు కాళ్ళు చేతులు నిలవడం లేదు. ఇక వచ్చే ఏడాది జులై 30 థియేటర్లలో జరిగే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా
    

Tags:    

Similar News