• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థియేటర్స్ తెరుచుకోవడంతో...

థియేటర్స్ తెరుచుకోవడంతో భారీగా తరలి వస్తున్న ప్రేక్షకులు...!

By - Tupaki Desk
Update: 2020-06-23 15:30 GMT
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడిపోతోంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాలలో సినీరంగం ఒకటి. దీని వలన గత రెండున్నర నెలలుగా సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడి ఉన్నాయి. దీంతో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కొన్ని దేశాల్లో నిబంధనలు సడలిస్తూ వస్తున్నారు. అక్కడక్కడ థియేటర్స్ కూడా రీ ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ లో కూడా థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతిచ్చారు.

కరోనా మహమ్మారి యూరప్ దేశాలను ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్య కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఫ్రాన్స్ లో ఆంక్షలు సడలించడంతో ప్రజలు యధావిధిగా బయటకు వస్తూ ఎప్పటిలాగే పనులు చేసుకుంటున్నారు. దాదాపుగా అంతా కంట్రోల్ ఉందని భావించిన ప్రభుత్వం అక్కడ సినిమా థియేటర్లు కూడా రీ ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నిన్నటి నుంచి అక్కడ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి రెండు సీట్లకు మధ్య గ్యాప్ ఉండేలా మధ్యలో మినియన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు.

దాదాపుగా 80 రోజుల తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ కి తరలివస్తున్నారు. బస్సుల్లో రైళ్లలో ప్రయాణం కంటే రెండు గంటల పాటు థియేటర్లో కూర్చోవడం పెద్ద రిస్క్ కాదని అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఫ్రాన్స్ వారు పాటించిన సీటింగ్ సిస్టమ్ ఫాలో అయ్యి మనదేశంలో కూడా థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారేమో చూడాలి.
Tags:    
  • France 
  • movie theatres 
  • reopen 
  • Seating arrangement 
  • Minions 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS