ఒకే నెలపై నలుగురు సూపర్ స్టార్స్ కన్ను
కరోనా కారణంగా సినిమా షెడ్యూల్స్ అన్ని కూడా అల్ల కల్లోలంగా మారిపోయాయి. ఏడాది జూన్ జులై వరకు సినిమాల విడుదల విషయంలో క్లారిటీ లేదు. ఇక షూటింగ్స్ కూడా ఏప్రిల్ మొత్తం జరిగే దాఖలాలు కనిపించడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మే నెలలో మళ్లీ షూటింగ్ లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో పలు సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. అయితే ఎన్ని సినిమాల తేదీలు మారినా కూడా వచ్చే సంక్రాంతికి వస్తామంటూ ప్రకటించిన జక్కన్న మాత్రం అదే తేదీకి రాబోతున్నాడు.
మామూలుగా అయితే సంక్రాంతి సీజన్ కు కనీసం రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు వస్తాయి. కాని జనవరి 8 2021న ఆర్ ఆర్ ఆర్ రాబోతుంది కనుక మొత్తం సీజన్ ను ఆ సినిమాకే వదిలేసే అవకాశం ఉంది. వస్తే ఒకటి రెండు చిన్నా చితకా సినిమాలు రావచ్చు అంటున్నారు. ఇక సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే ఏడాది సమ్మర్ ఆరంభంలో బడా హీరోల సినిమాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా సమ్మర్ ఆరంభం అయిన 2021 ఏప్రిల్ నెలపై ఏకంగా నలుగురు స్టార్ హీరోలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు తన 27 చిత్రాన్ని ఇంకా బన్నీ సుకుమార్ ల కాంబోలో తెరకెక్కబోతున్న ‘పుష్ప’ చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ 27 లేదా 28 చిత్రాల్లో ఏదో ఒకటి ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఇక ముందే ప్రకటించిన విధంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతంకు అయితే ఈ నలుగురు హీరోలు కూడా ఏప్రిల్ 2021పై దృష్టి పెట్టారు. పరిస్థితుల ప్రభావం వల్ల తేదీలు ఏమైనా మారుతాయో చూడాలి. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు అయినా ఏప్రిల్ లో మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.