నలుగురు హీరోయిన్ల వాట్సాప్ గ్రూప్

Update: 2017-10-03 15:30 GMT
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమా ఇప్పుడు అన్ని ఇండస్ర్టీలకూ చేరుతోంది. ఎవరి స్టైల్ లో వారు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ్ లో కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మలయాళంలో మంజిమా మోహన్ నటిస్తోంది. కన్నడలో పారుల్ యాదవ్ చేస్తోంది. నాలుగు భాషలకు సరైన హీరోయిన్స్ సెట్ అయ్యారు గాని హిందీలో కంగాన రనౌత్ సాధించిన బాక్స్ ఆఫీస్ వసూళ్లను  సాధిస్తారా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇకపోతే రీసెంట్ గా తెలుగు  వెర్షన్ మొదలైంది. మిగతా వారు కూడా ఆ దశలోనే ఉన్నారు. అయితే ఇటీవల క్వీన్ పాత్రలో నటించనున్న ఈ నలుగురు హీరోయిన్లూ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నారట. అంతే కాకుండా ఆ గ్రూపులో క్వీన్ దర్శకులు - నిర్మాతలు కూడా ఉన్నారట. సాధరణంగా సినీమా హీరోయిన్స్ అంతగా క్లోజ్ గా ఉండరని ఒక టాక్ ఉంది. కానీ ఈ హీరోయిన్స్ ని చూస్తుంటే నిజంగా మహారాణులే అనుకోవాలి మనం. ఇక హీరోయిన్స్ ఆ గ్రూపులో సినిమాకు సంబందించిన విషయాల గురించి చర్చించుకుంటున్నారట. ఈ గ్రూపు గురించి అడిగితే నిజమేనంటూ తమన్నా కన్ఫామ్ చేసిందండోయ్.

తెలుగు క్వీన్ విషయానికొస్తే..  తమన్నా - నీలకంఠ దర్శకత్వంలో నటిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నా కి అంతగా ఏ సినిమాలు కలిసిరావడం లేదు. దీంతో ఈ సినిమా ద్వారా తన గత వైభవాన్ని చాటుకోవాలని చూస్తోంది. దాదాపు 90% హిందీ బాలీవుడ్ క్విన్ చిత్రం స్క్రిప్ట్ నే రీమేక్ లో కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News