• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌స‌రా పండ‌గంటే ఇదీ.....

ద‌స‌రా పండ‌గంటే ఇదీ.. నాని దుమ్ము రేపాడుగా!

By - Tupaki Desk
Update: 2022-10-02 12:11 GMT
నేచురల్ స్టార్ నాని జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  చివరిసారిగా `అంటే సుందరానికి` చిత్రంలో కనిపించాడు. ఇది టిక్కెట్ విండోస్ వద్ద డీసెంట్ అనిపించింది కానీ ఆశించిన పెద్ద హిట్ ద‌క్క‌లేదు.

ఈసారి పూర్తి మాస్ అవ‌తార్ లో క‌నిపించ‌బోతున్నాడు. న‌టుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన `దసరా` పైనే ఇప్పుడు నానీ ఆశ‌ల‌న్నీ. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ధూమ్ ధామ్ దోస్తాన్ అనే టైటిల్ తో ఈ పాట రేపు విడుదల కానుంది. ఇదిలా ఉంటే నాని ఈరోజు తన ట్విట్టర్ ప్రొఫైల్‌ పాట ప్రోమోను లీక్ చేశాడు. దర్శకుడు ప్రోమోకు నో చెప్పడంతో తాను ఈ బిట్ ను లీక్ చేశానని రాశాడు. ఈ ప్రోమోలో నాని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో వైల్డ్ లుక్ లో ఆక‌ట్టుకున్నాడు. మున్ముందు పర్ఫెక్ట్ మాస్ నంబర్ లో దుమ్ము రేపుతాడ‌నే అర్థ‌మవుతోంది. అంతేకాదు ఈ సర్ ప్రైజ్ వీడియో అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది. ద‌స‌రా పండ‌గంటే ఇదీ.. నాని దుమ్ము రేపాడుగా! అంటూ అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. సినిమా ఆద్యంతం ఇంతే ఎన‌ర్జిటిక్ గా నాని క‌నిపిస్తే గ‌నుక హిట్టు కొట్ట‌డం ఖాయం అని అభిమానులు ఒక అంచ‌నాకి వచ్చేస్తున్నారు.

ఇందులో నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయికుమార్- సముద్రఖని- జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో 30 మార్చి  2023న విడుదల కానుంది. హిందీలోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం ప్లాన్ చేస్తోందని స‌మాచారం.

మేజ‌ర్ తో అడివి శేష్‌.. కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ హిందీ మార్కెట్లో నిరూపించారు. ఇక‌పై నాని వంతు. అత‌డు ద‌స‌రా చిత్రంతో హిందీ ఆడియెన్ ని కూడా మెప్పిస్తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు.

https://twitter.com/NameisNani/status/1576528856487366656
Tags:    
  • Natural Star Nani 
  • Dussehra 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

లిప్ సింకుకి త‌గ్గ‌ట్టు డ‌బ్బింగ్ మాట‌లు రాయ‌డం ఎలా?

2026-11-07 02:30 GMT

రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?

2026-11-07 02:11 GMT

ఐశ్వర్యారాయ్,‌ అభిషేక్ బచ్చన్ విడాకులు.. గట్టిగా క్లారిటీ ఇచ్చేసిన జంట..!

2026-11-07 02:10 GMT

నేటి కుర్ర హీరోల్లో ఆత్మవిశ్వాసం లేదు.. వాళ్లే చివరి సూపర్‌స్టార్లు!

2026-11-07 01:30 GMT

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు కొత్త చిక్కు.. స్క్రిప్ట్ దశలోనే చట్టం తెలియ‌క‌పోతే!

2026-11-07 00:30 GMT

యుద్ధం మార్చిన బాల్యం: బాలిక జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ

2026-11-06 23:30 GMT

2000-2026 మధ్య తెలుగులో టాప్ 5 విలన్ క్యారెక్టర్స్ ఇవే...

2026-11-06 22:30 GMT

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS