ఫస్ట్ డైరెక్ట్ రిలీజ్.. అట్టట్ట ఉందని అంటున్నారే!
మేము థియేటర్లలోనే విడుదల చేస్తామని చాలామంది మంకుపట్టుతో ఉన్నారు కానీ కొందరు మాత్రం రియాలిటీ గ్రహించి ఒటీటీలలో డైరెక్ట్ గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. తమిళ నాట ఈ సమ్మర్ కు రిలీజ్ కావాల్సిన సినిమాల్లో ఒకటి 'ఆర్ కె నగర్'. సీనియర్ టాలీవుడ్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు. నిజానికి ఈ సినిమాకు గత కొన్ని నెలలుగా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందట. ఇప్పుడు ఫైనల్ గా ఒటీటీ లో అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ సినిమాకు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన మాత్రమే దక్కింది. పొలిటికల్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్లాట్ వరకూ బాగానే ఉన్నా నరేషన్ పెద్దగా ఆసక్తికరంగా సాగలేదని అంటున్నారు. ముఖ్యంగా ఈ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్.. కామెడీ వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు. అయితే శంకర్ పాత్రలో వైభవ్ నటన మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఈ కరోనా క్రైసిస్ కారణంగా థియేటర్లు మూత పడిన తర్వాత ఒటీటీ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన మొదటి సౌత్ సినిమా కావడంతో మంచి పబ్లిసిటీ దక్కింది.
టికెట్ పెట్టి చూడమంటే జనాలు చూస్తారో లేదో కానీ ఒటీటీ లో కాబట్టి చూసేయవచ్చని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సనా అల్తాఫ్.. అంజనా కీర్తి.. సంపత్ రాజ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు శరవణ రాజన్ కాగా ఈ సినిమాను వెంకట్ ప్రభు నిర్మించారు.