• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శోభనం కోసం మహేష్ ని...

శోభనం కోసం మహేష్ ని వాడాడు

By - Tupaki Desk
Update: 2018-05-01 10:51 GMT
క్రియేటివిటీకి హద్దులు లేని మాట నిజమే కాని కొన్ని పరిమితులు ఉంటేనే దానికైనా అందం. కాని కొందరి అత్యుత్సాహం పుణ్యమా అని తెలివి కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తోడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఏది జరిగినా వైరల్ కావడానికి క్షణాల కంటే తక్కువ సమయమే పడుతోంది. పైన ఫోటో చూస్తున్నారుగా. ఒక యువకుడు తన శోభనానికి ఫ్లెక్సీ బ్యానర్ చేయించి ఏకంగా శపధం లాంటిది చేసేసాడు. అది కూడా మామూలుగా కాదండోయ్. భరత్ అనే నేనులో మహేష్ బాబు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టైల్ లో బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకుతూ మొదటి యుద్ధానికి సిద్ధ పడుతున్నాను అంటూ ఇక్కడ రాయలేని పదాలు అందులో పెట్టేసి అమ్మనాన్నలను త్వరలో నానమ్మ తాతయ్యలను చేస్తానని సవాల్ కూడా చేసేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా షేర్ అవుతోంది.

అయినా ఇది సంప్రదాయాలను ఎగతాళి చేయటమే తప్ప మరొకటి కాదని విరుచుకుపడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. పవిత్రమైన సృష్టి కార్యాన్ని ఏదో ఘన కార్యం లాగా ఏ మాత్రం మొహమాటపకుండా ఇలా ఊరందరిని ప్రచారానికి పిలవడం గురించి పేలుతున్న కామెడీ మామూలుగా లేదు. పైగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న భరత్ అనే నేను ఓత్ ని ఇలా హాస్యానికి వాడుకోవడం పట్ల మహేష్ ఫాన్స్ కోపంగా ఉన్నారు. ఈ బ్యానర్ లో పెళ్లి కొడుకు ప్రమాణం చేస్తున్నట్టు ప్రత్యేకంగా ఫోటో దిగి మరీ ఫోజివ్వడం చూసి నవ్వుకోని వారు లేరు. అతను ఎక్కడి వాడో ఈ శోభనం ఎప్పుడో వివరాలు తెలియవు కాని ఇప్పుడు ఇతగాడు ఉన్న ప్రాంతంలో బాగా పాపులర్ అయ్యుంటాడు అనడంలో మాత్రం అనుమానం అక్కర్లేదు. సినిమా ప్రభావం ఈ రేంజ్ లో ఉంటుందని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఇంతలా ఉంటుందని ఇలా సాక్ష్యాలతో సహా బయటపడినప్పుడు కాదనగలమా.
Tags:    
  • First Night Invitation 
  • Bharat Ane Nenu 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS