• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్‌ లుక్‌ : శర్వా...

ఫస్ట్‌ లుక్‌ : శర్వా 'శ్రీకారం' అదిరింది

By - Tupaki Desk
Update: 2020-01-27 07:36 GMT
విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ ఆరంభం నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ ను దక్కించుకుని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకున్న శర్వానంద్‌ త్వరలో 'జాను' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సెన్షేషనల్‌ సక్సెస్‌ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్‌ చేశారు. అక్కడ విజయ్‌ సేతుపతి చేసిన పాత్రను ఇక్కడ శర్వానంద్‌ చేసిన విషయం తెల్సిందే. జాను విడుదలకు సిద్దం అవుతున్న సమయంలోనే శ్రీకారంను ప్రకటించాడు.

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీకారం' ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది అంటూ కామెంట్స్‌ పొందుతుంది. శర్వానంద్‌ ఒక పల్లెటూరి కుర్రాడి మాదిరిగా లుంగీ కట్టుకుని బుజాన టవల్‌ వేసుకుని పొలం గట్టున నడుస్తున్న ఈ ఫస్ట్‌ లుక్‌ కు ఫిదా అవ్వని వారు అంటూ ఎవరు లేరు. చాలా కలర్‌ ఫుల్‌ గా ఉండటంతో పాటు ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటేనే సినిమాను చూడాలన్నంత ఆసక్తి కలుగుతుందంటూ శర్వా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ లో రామ్‌ ఆచంట మరియు గోపీ ఆచంటలు కిషోర్‌ బి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలతో పాటు సమ్మర్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. షూటింగ్‌ చకచక పూర్తి చేసి మే లేదా జూన్‌ ఆరంభంలో విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. జాను తర్వాత కొద్ది గ్యాప్‌ లోనే శ్రీకారం తో శర్వా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Sharwanand slips into Lungi for Sreekaram 
  • Sreekaram First Look 
  • Sreekaram 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS