జెర్సీపై నాని క్లారిటీ ఇచ్చాడోచ్

Update: 2019-04-15 05:47 GMT
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'జెర్సీ' ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.  శుక్రవారం రిలీజ్ అయిన ట్రైలర్ ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ పై బలమైన ముద్ర వేసింది. కొందరైతే క్లాసిక్ ఫిలిం లక్షణాలు కనిపిస్తున్నాయని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు.  మరి అది నిజమో కాదో మనకు ఏప్రిల్ 19 వ తారీఖునే తెలుస్తుంది.

ఇదిలా ఉంటే 'జెర్సీ' ఒక బయోపిక్ అనే వార్త ప్రచారం లో ఉంది.  ఈ సినిమా మాజీ ఇండియన్ క్రికెటర్ రమణ్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని ఆ వార్త సారాంశం. రమణ్ లాంబా ఢాకా లో ఒక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో బాల్ కణతకు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు.  జెర్సీ స్టొరీలైన్ కు రమణ్ జీవితానికి దగ్గర పొలికలు ఉండడంతో ఇలా ప్రచారం సాగుతోంది.  రమణ్ కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవడం మళ్ళీ ముప్పై నాలుగు.. ముప్పై ఐదు ఏళ్ళ వయసులో క్రికెట్ ను టేకప్ చేయడం జరిగింది.  మరి ఇది నిజమా కాదా అనే విషయంపై 'జెర్సీ' టీమ్ లో ఎవరూ స్పందించలేదు.  ఈ విషయం పై హీరో నానిని ప్రశ్నిస్తే 'జెర్సీ' రమణ్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాదని.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసిన కల్పితమైన కథ అని క్లారిటీ ఇచ్చాడు.   కానీ ఈ సినిమాలో నాని పోషిస్తున్న అర్జున్ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుందనే టాక్ ఉంది.  ఆ విషయంపై మాత్రం నాని స్పందించలేదు.

ఈ సినిమాకు రెండు క్లైమాక్సులను షూట్ చేసిపెట్టారని గతంలో ప్రచారం సాగింది. అందులో ఒకటి విషాదాంతం కాగా మరొకటి సుఖాంతం.. ఫైనల్ గా ఒక వెర్షన్ ఉంచుతారని కూడా అన్నారు. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టయితే సుఖాంతమే అయ్యే అవకాశం ఉంది.  సినిమా రిలీజ్ అయితే కానీ మనకు ఈ విషయం తెలీదు.
    

Tags:    

Similar News