షూటింగుల కోసం విదేశాలకు పయనమవుతున్న ఫిలిం మేకర్స్..!
సినిమాలకు గ్రాండియర్ లుక్ ని తీసుకురావడం కోసమో కథానుసారమో హంగామా కోసమో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం కోసమో మేకర్స్ భారీ ఖర్చు చేసి మరీ ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేస్తుంటారు. కథా వస్తువులాగో బ్యాక్ డ్రాప్ లాగానో విదేశీ లొకేషన్లు మన తెలుగు సినిమాలకి ఉపయోగపడుతుంటాయి. అయితే గతేడాది కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలల పాటు ఫారిన్ షెడ్యూల్స్ ని మర్చిపోవాల్సి వచ్చింది. ఆ మధ్య మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ఫిలిం మేకర్స్ అందరూ విదేశీ బాట పట్టారు. ఇప్పుడు ఇండియాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ చేసుకోవడం సేఫ్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియాలో ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండటంతో సినీ ఇండస్ట్రీ ముందు జాగ్రత్తగా సినిమా షూటింగులను నిలిపివేశారు. అయితే కొందరు మాత్రం కరోనా ప్రభావం తక్కువగా ఉన్న విదేశాల్లో షూటింగ్ చేసుకోవడం ఈజీ అని భావిస్తూ వాటి పర్మిషన్స్ కోసం తిరుగుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య - విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'థాంక్యూ' షూటింగ్ ఇటలీలో పూర్తి చేశారు. అలానే చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలోని పాటల షూట్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇప్పటికే దుబాయ్ లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసిన 'సర్కారు వారి పాట' టీమ్ మరో దుబాయ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇలా చాలా మంది సినిమా షూటింగులు కోసం ఫారిన్ వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు కరోనా వల్ల విదేశాల్లో చిత్రీకరణ కష్టంగా మారితే.. ఇప్పుడు మాత్రం ఇండియాలో వైరస్ ఉదృతి కారణంగా ఫారిన్ కి వెళ్తుండటం గమనార్హం.