అంచనాలు పెరుగుతాయి అంటున్న జక్కన్న

Update: 2020-05-08 12:30 GMT
కరోనా క్రైసిస్ వల్ల ఎక్కువ నష్టపోతున్న రంగాల్లో సినీ రంగం కూడా ఉంది. అయితే లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు నార్మల్ అవుతాయా లేదా అనేపై ఇప్పటికే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరో వైపు ఒటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్లకు మునుపటిలా వస్తారా అంటూ కొందరు సందేహాలు లేవనెత్తుతున్నారు. రీసెంట్ గా ఒక వెబ్ ఛానెల్ నిర్వచించిన వెబినార్ లో ఎస్ఎస్ రాజమౌళి ఈ విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"ప్రస్తుతానికి అయితే ప్రేక్షకులు సినిమా థియేటర్లకు గతంలో లాగా వస్తారా అనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో భారతీయ భాషలతో పాటు ఇతర విదేశీ భాషలకు సంబంధించిన ఇన్నోవేటివ్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు వాటిని చూస్తున్నారు. ఇలా వివిధ భాషల కంటెంట్ చూడడంతో వారి అంచనాలు పెరుగుతాయి. దీంతో వారిని మెప్పించేలా ఆసక్తికరమైన కంటెంట్ తో ఫిలిం మేకర్లు రావాలి" అన్నారు. అంతే కాదు.. కరోనా క్రైసిస్ తర్వాత బడ్జెట్లలో మార్పులు ఉంటాయని.. పారితోషికాలు తగ్గించుకోవాల్సి వస్తుందన్నారు.

ప్రేక్షకుల అంచనాలు పెరగడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇంట్లో ఒటీటీ యాప్స్ ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు తమిళం.. కన్నడ.. మలయాళం.. లాంటి మనం భారతీయ భాషలతో పాటు స్పానిష్ వెబ్ సీరీసులు కూడా చూస్తున్నారు. ఈలెక్కన వీరిని మెప్పించేలా సినిమాలు తీయాలంటే ఫిలింమేకర్లు తీవ్ర కసరత్తు చేయకతప్పదు.
Tags:    

Similar News