టైటిల్ 'ఫైటర్' కాదు.. జస్ట్ వెయిట్ అంటున్న పూరీ టీమ్

Update: 2020-05-18 07:10 GMT
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనంగా మారిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సినీ ఇండస్ట్రీ పై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మొత్తం సౌత్, నార్త్ ఇండస్ట్రీలన్నీ అర్జున్ రెడ్డి పై కన్నేశాయి. ఆ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర బాషా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ పై సినీ అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం మనసు పారేసుకోవడం విశేషం. అయితే అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల హిట్ల తర్వాత విజయ్ కి అన్ని చేదు అనుభవాలే మిగిలాయి. రీసెంట్ గా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో పెద్ద ప్లాప్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న ఈ సినిమాను పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి హీరోయిన్, సహనిర్మాత ఛార్మి ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరీ-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీకి టైటిల్ 'ఫైటర్' కాదని.. కేవలం ఫైటర్ అనేది నామమాత్రపు టైటిల్ అని చెప్పారు. ఇక ఈ సినిమా కోసం మరో మంచి టైటిల్ అనుకుంటున్నారట. ఆ టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఛార్మి వెల్లడించింది. ఈ న్యూస్ తో పూరీ అండ్ విజయ్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఎందుకంటే అందరూ ఇప్పటి వరకు ఫైటర్ టైటిల్ ఫిక్స్ అని అనుకున్నారు. కానీ తాజాగా ఛార్మి క్లారిటీ ఇచ్చేసరికి షాక్ తో పాటు ఇంటరెస్ట్ కూడా పెరిగింది. మరి పూరీ సినిమా అంటే టైటిల్ మినిమం ఉంటుందని అభిమానులలో అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఎలాంటి టైటిల్ ఆలోచిస్తున్నారో.. ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News