• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళయాళంలో ఫిదా...

మళయాళంలో ఫిదా చేయబోతున్నారు

By - Tupaki Desk
Update: 2017-11-07 04:47 GMT
దర్శకుడిగా శేఖర్ కమ్ములకు బ్రహ్మాండమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన చిత్రం హ్యాపీడేస్. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్టవడమే కాదు.. అందులో నటించిన వారందరికీ మంచి బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాతోనే తమన్నాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. హ్యాపీడేస్ కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు... మళయాళ ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా మళయాళ వెర్షన్ సూపర్ హిట్టయింది.

శేఖర్ కమ్ముల ఈ మధ్య కమర్షియల్ హిట్ కు దూరమై చివరకు ఫిదా సినిమాతో మళ్లీ తన సత్తా నిరూపించుకున్నాడు. వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అందరినీ ఫిదా చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను మళయాళంలో అదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ప్రం ద డైరెక్టర్ ఆఫ్ హ్యాపీడేస్ అన్న టైటిల్ తో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాయిపల్లవి మళయాళంలో ఓ రకంగా టాప్ హీరోయిన్ అని చెప్పాలి. ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రను మళయాళ ప్రేక్షకులను ఇప్పట్లో మర్చిపోరు. ఫిదాకు ఆమే హీరోయిన్ కావడం మరింత ప్లస్ పాయింట్. ఈ సినిమా మళయాళ రైట్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వేరేవరికీ ఇవ్వకుండా తనే డబ్బింగ్ చేయించారు.

మెగా హీరో అల్లు అర్జున్ కు మళయాళం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి యూత్ అతడిని ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. రామ్ చరణ్ కు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో వరుణ్ తేజ్ వెళ్తున్నాడు. ఫిదా మళయాళ వెర్షన్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటే అతడి మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి మెగా యూత్ హీరోలంతా మళయాళం ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నారు.

Full View
Tags:    
  • Varun Tej 
  • Sai Pallavi 
  • Fidaa Movie 
  • Telugu NEWs 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS