3 ఏళ్ల వయసులోనే లైంగిక వేదింపులు.. ఛాన్స్ కోసం అలా తప్పదన్నారు
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో గీతా ఫోగట్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఫాతిమా సనా షేక్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. నటిగా అవకాశాలు దక్కించుకునేందుకు చాలా కష్టపడ్డట్లుగా చెబుతోంది. బాల నటిగా చిన్నప్పటి నుండే ఇండస్ట్రీలో ఉన్నా కూడా హీరోయిన్ గా ఆఫర్లు దక్కడం మాత్రం చాలా కష్టం అయ్యింది.
ఎన్నో చోట్లకు వెళ్తే అక్కడ పరాభవం ఎదురైంది. ముఖ్యంగా కొందరు నన్ను కమిట్ మెంట్ అడిగారు. ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే సినిమా అవకాశాలు కావాలంటే అలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ క్వాలిఫికేషన్ అన్నట్లుగా మాట్లాడేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె వెళ్లడించింది.
ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం కామన్ అయ్యింది. నేను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే లైంగిక వేదింపులను ఎదుర్కొన్నాను. లైంగిక వేదింపులు అనేవి అన్ని చోట్ల చాలా కాలంగా ఉంటున్నాయి. కాని మహిళలు వాటిని చెప్పుకోలేక పోయారు. కాని ప్రస్తుత పరిస్థితి మారింది. అదృష్టవశాత్తు చదువుకోవడం వల్ల లైంగిక వేదింపులకు సంబంధించి మహిళలకు అవగాహణ వస్తుంది. అందుకే వారంతా కూడా ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నారు.
లైంగిక వేదింపులకు గురి అయిన వారు బయటకు చెబుతున్న నేపథ్యంలో ఆడవారిపై ఇప్పుడు వేదింపులు కూడా తగ్గాయి అంది. ఇక దంగల్ సహనటి సన్య మల్హోత్రాతో డేటింగ్ లో ఫాతిమా ఉందనే వార్తలపై కూడా స్పందించింది. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక పెళ్లి అనేది తన జీవితంలో ఉండదు అని.. ఇద్దరి వ్యక్తుల మద్య ప్రేమ ఉంది అని నిరూపించేందుకు పెళ్లిని చూపిస్తున్నారు. అలాంటి పెళ్లిపై తనకు నమ్మకం లేదు అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది.