• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పొడగరి సుందరి పోటీకి...

పొడగరి సుందరి పోటీకి దిగిపోయినట్టే!

By - Tupaki Desk
Update: 2021-12-29 10:30 GMT
ఆ మధ్య థియేటర్లకు వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా చూసినవాళ్లందరి మనసులు ఫరియా అబ్దుల్లాపైకి వెళ్లాయి. ఈ జాతిరత్నం ఎవరబ్బా? అనుకుంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఇంత అందం ఇప్పటివరకూ ఎక్కడ వుంది? అంటూ నోరెళ్లబెట్టారు. హైదరాబాద్ అమ్మాయి అని తెలిసి 'ఔనా' అంటూ షాక్ అయ్యారు. చందమామ వంటి ఫేసు .. నక్షత్రాల్లాంటి కళ్లు .. ఇంద్రధనుస్సు వంటి కనుబొమలు .. సన్నజాజి మొగ్గలతో చేసినట్టుగా అనిపించే నాజూకైన నాసిక ఈ అమ్మాయి మనసులన్నింటినీ ఎడా పెడా దోచేసింది.

పాలపిట్టకి పడుచుదనం వచ్చేసినట్టుగా అమ్మాయి భలేగా ఉందని కుర్రాళ్లంతా అనుకున్నారు. తెలుగు తెరపై ఈ బ్యూటీ తన జోరు చూపడం ఖాయమని చెప్పుకున్నారు. ప్రభాస్ .. మహేశ్ .. నాగశౌర్య .. గోపీచంద్ వంటి పొడగరి హీరోల సరసన ఈ అమ్మాయి బాగా నప్పుతుందని అనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు వచ్చి పడిపోలేదుగానీ, ఇప్పుడిప్పుడే అందుకుంటోంది. 'బంగార్రాజు' కోసం ఒక స్పెషల్ సాంగ్ చేసిన ఈ సుందరి, సంతోష్ శోభన్ తో ఆడిపాడటానికి రెడీ అవుతోంది.

'ఏక్ మినీ కథ' .. 'మంచి రోజులు వచ్చాయి' వంటి సినిమాలతో సంతోష్ శోభన్ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. 'ఏక్ మినీ కథ' సినిమాకి రచయితగా పని చేసిన మేర్లపాక గాంధీ, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' .. 'కృష్ణార్జున యుద్ధం' వంటి హిట్స్ వచ్చాయి. ఒక్క 'మాస్ట్రో' మాత్రమే ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయన సంతోష్ శోభన్ తో కలిసి సెట్స్ పైకి వెళుతున్నాడు.

ఈ సినిమాకి వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

'శ్యామ్ సింగ రాయ్' సినిమాతోనే వెంకట్ బోయినపల్లి నిర్మాతగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో రెండో సినిమాగా తన సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను మొదలుపెడుతున్నాడు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ జోడీగా ఫరియా అబ్దుల్లాను తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రలో గ్లామర్ పాళ్లు ఎక్కువగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. గ్లామర్ పరంగా ఈ బ్యూటీ పోటీకి దిగుతోంది కనుక, ఇప్పటి వరకూ హాట్ అనిపించుకున్న ముద్దుగుమ్మలంతా ఇక కూల్ గా ఉండటం కష్టమే.
Tags:    
  • Faria Abdullah 
  • Faria Abdullah images 
  • Faria Abdullah pics 
  • Faria Abdullah dance 
  • Faria Abdullah instagram pics 
  • Jathi Ratnalu 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS