రాధేశ్యామ్ : ఈసారి మాత్రం ఫ్యాన్స్ శాటి స్పై అవడం పక్కా!

Update: 2020-10-20 08:50 GMT
బాహుబలి తో అంతర్జాతీయ ఖ్యాతిపొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తర్వాతి సినిమా అయిన సాహో పై ఆకాశాన్ని అందుకునే అంచనాలు పెట్టుకోగా వాటిని దర్శకుడు సుజిత్ నిండా  ముంచాడు. తెలుగులో ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. బాలీవుడ్లో మాత్రం మంచి వసూళ్లను  అందుకుంది. ప్రభాస్ నటించిన ఏ సినిమాలోనూ లుక్స్ పరంగా విమర్శలు వచ్చింది లేదు. ప్రతి ఒక్కరూ ప్రభాస్ ని ప్రత్యేకంగా ప్రజెంట్ చేసిన వారే. అలాంటిది ఒక అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న సాహోలో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. అతడి హెయిర్ స్టైల్ కానీ,  లుక్స్ కానీ అభిమానులకు నచ్చలేదు. ఈ విషయంలో కేర్ తీసుకున్నందుకు డైరెక్టర్ సుజిత్ పై విమర్శలు వచ్చాయి.

అయితే ప్రభాస్ నుంచి ఎటువంటి ఎలిమెంట్స్ ని కోరుకుంటున్నారో, ఎలాంటి లుక్కులో చూడాలనుకుంటున్నారో అలా రాధే శ్యామ్ లో ప్రభాస్ కనిపిస్తారని చెబుతున్నారు. దర్శకుడు రాధాకృష్ణ తన మొదటి సినిమాలో చిన్న చిత్రం అయినప్పటికీ గోపీచంద్ ని ప్రత్యేకంగా చూపించాడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో ప్రభాస్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో అందుకు తగ్గట్లుగా రాధాకృష్ణ డ్రెస్సింగ్ రెడీ చేయించారట. ఇప్పటికే విడుదలైన కొన్ని స్టిల్స్ లో ప్రభాస్ లుక్ అదిరి  పోయేలా ఉంది. ఈసారి మాత్రం ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగేనని చెబుతున్నారు.
Tags:    

Similar News