• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ తో బండ్ల సినిమా.. మన...

పవన్ తో బండ్ల సినిమా.. మన దేవుడు బ్లెస్సింగ్స్ కావాలంటూ ట్వీట్...!

By - Tupaki Desk
Update: 2020-08-30 14:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మారి పవన్ తో 'తీన్ మార్' అనే సినిమా నిర్మించాడు. ఈ మూవీ పరాజయం పాలైనా పవన్ పిలిచిమరీ 'గబ్బర్ సింగ్' సినిమాని బండ్ల గణేష్ కి అప్పగించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో పాటు అప్పటికి పవన్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే 'గబ్బర్ సింగ్' తర్వాత వీరి కలయికలో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుండటంతో మరోసారి ఆయనతో సినిమా చేయాలని బండ్ల గణేష్ ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కాగా, ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అభిమాని 'మా అన్న పవన్ అన్నతో సినిమా ఎప్పుడు తీస్తున్నారు' అని బండ్ల గణేష్ ని ప్రశ్నించాడు. దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ ''నేను అదే పనిలో ఉన్నాను బ్రదర్.. మన దేవుడి బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాను'' అని ట్వీట్ చేశాడు. మొత్తానికి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా తీసే ప్రయత్నాల్లోనే ఉన్నాడని అర్థం అవుతోంది. ఇంతకముందు కూడా ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ - బండ్ల గణేష్ - హరీష్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' లాంటి సినిమా మళ్ళీ ఇస్తారని ఆశిస్తున్నామని ట్వీట్ చేయగా.. బండ్ల గణేష్ దీనికి స్పందిస్తూ ''ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్‌ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. మన పవర్ స్టార్ అభిమానులు సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా. ఇది నా సంకల్పం'' అని పేర్కొన్నారు. మరి భవిష్యత్ లో వీరి కాంబోలో సినిమా ఉంటుందేమో చూడాలి.


Tags:    
  • Pawan Kalyan 
  • Powerstar 
  • Tollywood 
  • actor 
  • Movies 
  • Bandla Ganesh 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS