నేషనల్ హీరో బయోపిక్ తీయాలని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్..!

Update: 2021-05-16 02:30 GMT
కరోనా విపత్కర పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అనేక సామాజిక కార్యకలాపాలతో ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 'సోనూ సూద్' అంటే ఒకప్పుడు కేవలం సినిమాలో విలన్ పాత్రలు పోషించే ఒక నటుడు మాత్రమే. కానీ ఇప్పుడు సోనూసూద్ అంటే ఒక రియల్ హీరో. అడిగినది లేదనకుండా తన వంతు సాయం చేస్తూ ప్రజల పాలిట దైవంగా మారాడు. గతేడాది లాక్ డౌన్ లో వలస కార్మికులకు సహాయం చేయడంతో స్టార్ట్ చేసిన సోనూసూద్.. లాక్ డౌన్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నాడు.

కరోనా సెకండ్ వేవ్ కష్టసమయంలో సోనుసూద్ తన ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్స్ - ఆక్సిజన్ సిలిండర్స్ - ఆసుపత్రిలో బెడ్స్ వంటి వాటి విషయంలో సహాయం చేస్తూ మంచి మనసు చాటుకున్నారు. సినిమాల్లో ఆయన చేసేవి విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం ఓ సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చున్నారు. తన సంతృప్తి కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నానని.. మరే ఇతర ప్రయోజనం కోసం కాదని చెప్తున్న సోనూ.. ప్రజల మనసులు గెకుచుకున్నాడు. అందుకే ఆయన్ని ఆరాధించే జనాలు ఇప్పుడు సోనూసూద్ బయోపిక్ తెరకెక్కించాలని కోరుతున్నారు.
Read more!

వివిధ రంగాల్లో రాణించి అందరికి ఆదర్శవంతులుగా నిలిచిన ప్రముఖుల జీవితాలపై బయోపిక్స్ వస్తుంటాయి. సినీ రాజకీయ క్రీడా సేవా రంగాల్లో సక్సెస్ అయిన వ్యక్తుల జీవిత కథలతో తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా అనేక బయోపిక్స్ తెరకెక్కాయి. ఈ క్రమంలో నేషనల్ హీరోగా పిలవబడుతున్న సోనూ భాయ్ లైఫ్ స్టోరీ ఆధారంగా సినిమా తీయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో సోనూ కు వచ్చిన పాపులారిటీ.. ప్రజల్లో ఆయనకు ఏర్పడిన ఇమేజ్ ఇప్పుడు ఇంకెవరికి లేదనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. అలాంటి రియల్ హీరో బియోపిక్ తీయడానికి భవిష్యత్ లో ప్లాన్స్ జరుగుతాయేమో చూడాలి.
Tags:    

Similar News