మెగా హీరోలకు ఫ్యాన్స్‌ విజ్ఞప్తి

Update: 2020-11-10 07:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో టాలీవుడ్‌ లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. చిరంజీవికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా ఆయన ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యాన్స్‌ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరు తమ్ముడు మెగా బ్రదర్‌ నాగబాబు కరోనాను జయించాడు. జన్యు పరంగా చూసుకుంటే చిరంజీవి కూడా కరోనాను జయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వైధ్యులు కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక చిరంజీవి ఆరోగ్యం విషయంలో ఎలాంటి టెన్షన్‌ అవసరం లేదు అంటున్నారు. కాని మెగా ఫ్యాన్స్‌ మాత్రం తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటికే నాగబాబు మరియు చిరంజీవిలు కరోనా బారిన పడటంతో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పై అందరి దృష్టి ఉంది. పవన్‌ ఇన్నాళ్లు ఇంటికే పరిమితం అయినా ఈమద్య మళ్లీ షూటింగ్‌ కు జాయిన్‌ అయ్యాడు. ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత మరో సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇటీవల పవన్‌ మెట్రో ప్రయాణం చేశాడు. షూటింగ్‌ సమయంలో అప్పుడప్పుడు మాస్క్‌ లేకుండా ఉండాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అభిమానులు పవన్‌ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

కరోనా వైరస్‌ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక రూపంలో వస్తుంది. కనుక ఇలాంటి సమయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వైధ్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ మెగా ఫ్యాన్స్‌ అంతా ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా వివిధ మార్గాల ద్వారా పవన్‌ కు మరియు ఇతర మెగా హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమాలు కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కాని ఆరోగ్యం ముఖ్యం అంటూ మెగా హీరోల అందరి ఆరోగ్యం విషయంలో ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News