ఆ సినిమాను తారే జ‌మీన్ తో పోల్చిన మీడియా

Update: 2018-03-23 08:04 GMT
ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ఒక సినిమాను ఒక గొప్ప సినిమాతో పోల్చ‌టం చాలా అరుదుగా జ‌రిగేది. అందునా.. తెలుగులో సినిమా రివ్యూలు ఇవ్వ‌ని మీడియా సంస్థ‌ల్లో ఈనాడు ఒకటిగా చెబుతారు. ఇప్ప‌టికే త‌మ దిన‌ప‌త్రిక‌లో సినిమా రివ్యూ ఇవ్వ‌దు. అయితే.. ఆ మీడియా డిజిట‌ల్ ఫ్లాట్ ఫాం - మొబైల్ యాప్ లలో రివ్యూ ఇస్తుంటారు.

క‌ర్ర విర‌క్కుండా.. పాము చావ‌ని రీతిలో రివ్యూలు ఇస్తుంటార‌ని.. ఆగ్ర‌తారల సినిమాల గురించి అయితే అస‌లు చెప్పాల్సిన అవ‌స‌రమే లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంటుంది. సినిమా బాగున్నా పొగిడే విష‌యంలోనూ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న మాట ఉంది.

అలాంటిది ఈ రోజు విడుద‌లైన నీదీ నాదీ  ఒకే క‌థ చిత్రానికి సంబంధించి ఇచ్చిన రివ్యూ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే డిఫ‌రెంట్ ప్ర‌చారం చేస్తున్నారు. "ఈ మూవీని మేధావులు..  పక్కనవాళ్ల పనిని, పనితనాన్ని చులకనగా చూసేవారు దయచేసి మా సినిమాకు రాకండి. ఇది కేవలం మాకు, మాలాంటి వాళ్లకు సంబంధించిన కథ" అంటూ సూటిగా చెప్పేయ‌టం సినిమా మీద ఆస‌క్తిని మ‌రింత పెంచేలా చేసింది.

శ్రీ‌విష్ణు న‌టించిన ఈ సినిమాకు క‌థ‌.. ద‌ర్శ‌క‌త్వాన్ని వేణు పూడుగుల నిర్వ‌హించారు. ఆస‌క్తిక‌ర‌మైన ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలో.ఈ సినిమాను తెలుగు తారే జ‌మీన్ ప‌ర్ గా పోల్చటం విశేషం. ఎప్పుడూ ఆచితూచి అన్న‌ట్లుగా ఉండే అగ్ర మీడియా సంస్థ ఒక్క‌సారిగా ఇంత భారీ పొగ‌డ్త‌ను ఇవ్వ‌టం ఏమిటో?


Tags:    

Similar News