హాలీవుడ్ సినిమాలు తీసిన నగరాలు చూసొద్దామా?

Update: 2016-07-04 22:30 GMT
 సినిమా షూటింగులంటే ఆసక్తి లేనిదెవరికి? షూటింగు చూడాలని చాలామంది అనుకుంటారు.. అలాగే సినిమాలు తీసిన లొకేషన్లు కూడా చూడాలని అనుకుంటారు. తెలుగు సహా భారతీయ చిత్రాల షూటింగు కోసం విదేశాలకు వెళ్తుంటే హలీవుడ్ సినిమాల కోసం భారత్ వస్తున్నారు. భారత్ లోని వివిధ లోకేషన్లలో తమ సినిమాలు తీస్తున్నారు. అలాంటి కొన్ని ప్రాంతాలు నిజంగా దర్శనీయ స్థలాలే. అవేంటో చూద్దామా మరి..

- జోధ్ పూర్

ది డార్జిలింగ్ లిమిటెడ్ అనే హాలీవుడ్ సినిమాను ఇక్కడే తీశారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ చారిత్రక ప్రాంతం. ఏటా ఇక్కడకు వచ్చే సందర్శకులు తక్కువేం కాదు. చారిత్రక కట్టడాలు విస్తారంగా ఉంటాయి.

- ఢిల్లీ

జూలియా రాబర్ట్స్ వంటి టాప్ స్టార్ నటించిన ఈట్ ప్రే  లవ్ సినిమా ఇక్కడే తీశారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ తిరుగులేని పర్యాటక ప్రాంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి ఫుడ్ - షాపింగ్ అనుభవం బాగుంటుంది. విశాలమైన రోడ్లు - విహార స్థలాలు - కట్టడాలు అన్నీ ప్రత్యేకమే.

- ముంబయి

మిలియన్ డాలర్ ఆర్మ్, స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి సినిమాలు చాలాభాగం ఇక్కడ తీసినవే. ఇండియాలో చాలా ఫాస్ట్ లైఫ్ స్టైల్ ఉన్న సిటీ ఇది. జనం ఉరుకులు - పరుగులు పెడుతుంటారు. సిద్ధి వినాయక ఆలయం - జుహూ బీచ్ - గేట్ వే ఆఫ్ ఇండియా - వంటి ఎన్నో ప్రాంతాలను చూడొచ్చు.

- కోల్ కతా

ది నేమ్ సేక్ అనే సినిమాను ఎక్కువ భాగం కోల్ కతాలోనే తీశారు. ఇండియన్ సిటీస్ లో తప్పకుండా విజిట్ చేయాల్సివాటిలో కోల్ కతా కూడా ఒకటి. విక్టోరియా మహల్ వంటి అపురూ కట్టడాలకు అది నెలవు. అంతేకాదు.. సైన్సు సిటీ - నికో పార్కు - ఈడెన్ గార్డెన్సు వంటివన్నీ చూడదగినవే. హుగ్లీ నదిపై వంతెనలూ ప్రత్యేకమే.

- జైపూర్ - ఉదయ్ పూర్

ది బెస్టు ఎక్సోటిక్ మేరీ గోల్డ్ హోటల్ సినిమాను రాజస్థాన్ లోని ఈ రెండు ప్రాంతాల్లో తీశారు. ఈ రెండూ సాంస్కృతికంగా ఎంతో గొప్ప నగరాలు. జైపూర్ కోట ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జైపూర్ ను పింక్ సిటీ అంటారు. ఉదయ్ పూర్ కూడా అందమైన కట్టడాలకు నిలయం.

- పుణె

ది మైటీ హార్ట్ సినిమాను పుణెలో తీశారు. గార్డెన్సు - ఆలయాలు ఉంటాయి. సాఫ్టువేర్ రంగం ఇక్కడ అభివృద్ధి చెందడంతో యువత ఎక్కువగా కనిపిస్తారు. ఆధునిక జీవన శైలి కనిపిస్తుంది.

- గోవా

ది బోర్న్ సుప్రిమసీ సినిమా తీసిన ప్రాంతమైన గోవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గోవా అంటేనే ఎంజాయ్ మెంట్ కు మారుపేరు. అక్కడి బీచుల్లో విహారానికి పర్యాటకులు ప్రాధాన్యమిస్తారు.

- లఢక్ - వారణాసి

ది క్యూరియస్ కేస్ బెంజమిన్ బటన్ సినిమాను లఢక్ - వారణాసిలో తీశారు. కాశ్మీర్ లోని లఢక్ అద్భుతమైన ప్రాంతం. అలాగే వారణాసి ఆలయాల నగరం. గంగానదీతీరంలోని వారణాసి పవిత్ర నగరంగా పేరుగాంచింది. రెండు ప్రాంతాలూ అద్భుతమైనవే.

Tags:    

Similar News