• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఫ్యామిలీ డ్రామా'...

'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్: సైకో కిల్లర్ గా మారిన సుహాష్..!

By - Tupaki Desk
Update: 2021-07-22 05:16 GMT
'కలర్‌ ఫొటో' చిత్రంతో హీరోగా మారిన హాస్యనటుడు సుహాష్.. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సుహాష్.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న సుహాష్.. ఇప్పుడు ''ఫ్యామిలీ డ్రామా'' అనే మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మెహర్‌ తేజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

టైటిల్ 'ఫ్యామిలీ డ్రామా' అయినప్పటికీ.. ట్రైలర్ చూస్తుంటే ఇదొక సైకో క్రైమ్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. సుహాష్ ఇందులో సైకో కిల్లర్‌ గా నటించినట్లు తెలుస్తోంది. వినోదం కోసం మనుషుల గొంతు కోసి హత్య చేస్తూ కనిపిస్తున్నాడు. సుహాష్హెయిర్ స్టైల్ - బాడీ లాంగ్వేజ్.. అతని బిహేవియర్ కొత్తగా ఉన్నాయి. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేస్తూ వస్తున్న సుహాష్.. ఈసారి కంప్లీట్ డిఫరెంట్ గా సీరియల్ కిల్లర్ రోల్ ట్రై చేస్తున్నాడు.
 
తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్న ఓ ఫ్యామిలీకి సహాయం చేయడానికి వచ్చిన సైకో కిల్లర్ సుహాష్.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ లో చూపించారు. దీనికి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ సైకో కిల్లర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రంలో తేజ - పూజ కిరణ్‌ - శ్రుతి - అనూష - సంజయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

రామ్ వీరపనేని సమర్పణలో చష్మా ఫిల్మ్స్‌ - నూతన భారతి ఫిల్మ్స్‌ బ్యానర్ పై 'ఫ్యామిలీ డ్రామా' సినిమా రూపొందుతోంది. అజయ్‌ - సంజయ్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్‌ ఆర్‌. శాకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రామకృష్ణ అర్రం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Full View




Tags:    
  • Family Drama 
  • Family Drama movie 
  • Family Drama movie trailer 
  • Suhas Family Drama 
  • Colour photo 
  • Family Drama movie release date 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS