కౌచ్ గేమ్: టాలీవుడ్ లో ఫేక్ క్యాస్టింగ్ డైరెక్టర్లు
సినీపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రముఖంగా చర్చ సాగుతోంది. 2017-19 సీజన్ లో మీటూ ఉద్యమం పేరుతో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలెన్నో బయట ప్రపంచానికి వెలుగు చూశాయి. పలువురు అగ్ర కథానాయికలు సైతం తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడడం ఓ పెను విప్లవానికి దారి తీసింది. క్వీన్ కంగన నుంచి కాజల్ వరకూ.., ముంబై మోడల్స్ నుంచి తెలుగమ్మాయిల వరకూ ప్రతి ఒక్కరూ వేధింపుల ప్రహసనంపై ఓపెన్ అయ్యారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేమని వీళ్లంతా ఉటంకించారు.
అయితే కాస్టింగ్ కౌచ్ కి అసలు కారకులు ఎవరు? అంటే అన్ని వేళ్లు `మేనేజర్ల` వైపు చూపిస్తున్నాయి. కాస్టింగ్ డైరెక్టర్లు.. ప్రొడక్షన్ మేనేజర్ల పాత్రపై ఇప్పటికే బోలెడన్ని ఆధారాలు దొరికాయి. బాలీవుడ్ లో పలువురు కాస్టింగ్ డైరెక్టర్లు, పీఆర్ మేనేజర్లు, ప్రొడక్షన్ మేనేజర్ల పై పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఆధారాలతో పట్టుబడిన వాళ్లు ఉన్నారు. అయితే ఈ ప్రహసనం టాలీవుడ్ లో ఎంత? అంటూ ఇక్కడ నివురు గప్పిన నిప్పులా సన్నివేశం ఉందని ``తుపాకి గూఢచారి సర్వే`` తేల్చింది.
ఈ పరిణామం వల్ల కాస్టింగ్ కౌచ్ తగ్గిందా? అంటే ససేమిరా అన్న మాటా పరిశ్రమలో వినిపిస్తోంది. ప్రస్తుతం విజువల్ మీడియంలో అవకాశాలు అంతకంతకు పెరుగుతున్నాయి. సినిమా - టీవీ- యూట్యూబ్ మాధ్యమాల్లో అవకాశాలు అంతకంతకు పెరుగుతున్నాయి. టీవీ సీరియళ్లు - లఘుచిత్రాలు - వెబ్ సిరీస్ లు అంటూ కాస్టింగ్ సెలక్షన్స్ కి సంబంధించి యువతీయువకులకు గాలం వేయడం పెరుగుతోంది. ముఖ్యంగా పరిమిత బడ్జెట్లతో వెబ్ సిరీస్ లు తీసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లు.. యాడ్ షూట్లు పేరుతో కాస్టింగ్ డైరెక్టర్ల హిడెన్ ఎజెండా బయటపడుతోంది. కొందరు జెన్యూన్.. అసలు జెన్యూన్ కాని వాళ్లు ఎందరో! మగువలపై వీళ్ల అరాచకాలపై పలు సర్వేలు ఆసక్తికర సంగతుల్ని బయటికి తెస్తున్నాయి. ఇప్పటికే వెబ్ సిరీస్ ల పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న బూచోళ్లు పెరుగుతున్నారని తెలుస్తోంది. 16 - 20 వయసు మధ్య అమ్మాయిలు కావలెను అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న వాళ్లకు కొదవేం లేదు. అయితే ఇలా కాస్టింగ్ సెలక్షన్స్ అంటూ పిలిచే కంపెనీల్లో ఏది బోగస్? ఏది నిజమో చెప్పడం చాలా కష్టం. కొన్ని రిజిస్టర్డ్ ఫర్మ్స్ .. మరికొన్ని నాన్ రిజిస్టర్డ్ ఫర్మ్స్ ఉన్నాయి. లోన అసలేం జరుగుతోంది? అన్నది ఎవకిరీ ఏదీ తెలీదు.
పిలిచి ఛాన్సులిస్తున్నారా? గ్యారెంటీగా డబ్బులిస్తున్నారా? అన్నది కూడా చెప్పలేం. అవకాశం కోసం కమిట్‌మెంట్ తప్పని సన్నివేశంలో అమ్మాయిలు ఎలా బయటపడుతున్నారు? అన్నది కూడా ఎవరికీ తెలీని సన్నివేశం ఉంది. టీవీ, వెబ్ సిరీస్ లలో ఛాన్సులు అంటూ గాలం వేస్తున్నారు బూచోళ్లు. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త!! కొందరినే నమ్మాలి.. కొందరు అప్పంబప్పం గాళ్లు... కంత్రీ బాబులున్నారు జాగ్రత్త!!