• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్ క్లూజివ్: మరోసారి...

ఎక్స్ క్లూజివ్: మరోసారి జత కట్టిన విజయ్ దేవరకొండ - రష్మిక..!

By - Tupaki Desk
Update: 2021-04-20 07:40 GMT
టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జోడీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'గీతగోవిందం' సినిమాలో 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన ఈ జంట.. 'డియర్ కామ్రెడ్' మూవీతో మరోసారి జతకట్టారు. సిల్వర్ స్క్రీన్ పై మంచి జోడీ అనిపించుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ లో రిలేషన్ షిప్ లో ఉన్నారని అప్పట్లో పుకార్లు ఓ రేంజ్ లో పుట్టుకొచ్చాయి. హీరో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం ఇదేనని గుసగుసలు వినిపించాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ఈ క్రేజీ జంట.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి విజయ్ - రష్మిక కలిసి నటించినట్లు తెలుస్తోంది. కాకపోతే అది ఏ సినిమా కోసమో అనుకుంటే పొరపాటే. వీరిద్దరూ కలిసి నటించింది ఓ కమర్షియల్ యాడ్ కోసం.

సంతూర్ ప్రొడక్ట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ గా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరితో ఇటీవల యాడ్ షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ మోకాళ్లపై కూర్చొని రష్మికకు ఓ గిఫ్ట్ అందిస్తున్నట్లు ఈ యాడ్ లో కనిపిస్తున్నారు. వెండితెరపై ఫర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్న విజయ్ - రష్మిక సంతూర్ యాడ్ తో మరోసారి అలరించబోతున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. విజయ్ 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంటే.. 'మిష‌న్ మ‌జ్ను' సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్‌ లో అడుగుపెడుతోంది. రెండు సినిమాల షూటింగ్స్ ముంబై లోనే జరుగుతుండటంతో ఇద్దరూ వీలైనప్పుడల్లా కలుస్తున్నారని తెలుస్తోంది.
Tags:    
  • Vijay devarakonda 
  • rashmika movies 
  • vijay rashmika new ad 
  • Vijay devarakonda Latest Movies 
  • Vijay devarakonda Latest Updates 
  • Vijay devarakonda Movies 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS