• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'లవ్ స్టోరీ' నుంచి మరో...

'లవ్ స్టోరీ' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్.. 'ఏవో ఏవో కలలే'..!

By - Tupaki Desk
Update: 2021-03-25 05:06 GMT
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా ''లవ్ స్టోరీ''. వేసవి కానుకగా ఏప్రిల్ 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి 'ఏవో ఏవో కలలే' అనే పాటను వదిలారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేసారు.

'ఏవో ఏవో కలలే.. ఎన్నో ఎన్నో తెరలే.. అన్నీ దాటి మనసే.. ఎగిరిందే.. నన్నే నేను గెలిచే.. క్షణాలివే కనుకే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. పవన్ సి.హెచ్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ కి భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం అందించారు. సింగర్స్ జోనితా గాంధీ - నకుల్ అభ్యంకార్ కలిసి ఆలపించారు. ఈ వాన పాటలో సాయి పల్లవి - చైతూ డ్యాన్స్ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తోంది. 'సారంగ దరియా' పాటలో సోలో గా స్టెప్పులేసిన సాయి పల్లవి.. ఈ రెయిన్ డ్యూయెట్ లో చైతూతో కలిసి అలరించనుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

'లవ్ స్టోరీ' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. వచ్చే నెల 16న విడుదల కానున్న ఈ అందమైన ప్రేమ కావ్యం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Full View

Tags:    
  • Evo Evo Kalale Lyrical Song 
  • Naga Chaitanya 
  • Sai Pallavi 
  • Love Story Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS