'లాక్ డౌన్'లోను కరోనా పై షూటింగ్ చేస్తున్న యంగ్ డైరెక్టర్!!

Update: 2020-07-30 10:30 GMT
కరోనా మహమ్మారి భయంతో సినీ నిర్మాతలు తమ సినిమాల షూటింగ్స్ ప్రారంభించడానికి భయపడుతున్నారు. సినిమా షూటింగ్స్, బుల్లితెర షూటింగ్స్ జరుపుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో నిబంధనలతో కూడిన అనుమతులు లభించినప్పటికీ దర్శకనిర్మాతలు ఎవరూ కూడా షూటింగ్స్ జరపడానికి ధైర్యం చేయడం లేదు. కొందరు అనుమతులు లభించగానే స్టార్ట్ చేసినా మళ్లీ నిలిపేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా రోజురోజుకి వేల సంఖ్యలలో విలయతాండవం చేస్తోంది. అయితే ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం తన సినిమా షూటింగ్ యథావిధిగా జరుపుతున్నాడు. అతనెవరో కాదు.. ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ తన ఫస్ట్ సినిమా ‘అ!’ తోనే విమర్శకుల నుండి ప్రశంసలు పొందాడు. ఆ సినిమాలో సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చాడు. ఇక తన రెండో ప్రయత్నంగా యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌తో ‘కల్కి’ చిత్రం తెరకెక్కించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

అయితే ఇప్పుడు తన మూడో సినిమా సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కరోనా వైరస్ నేపథ్యంలో చేస్తున్నట్లు ప్రశాంత్ ఇదివరకే ప్రకటించాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ పోస్టర్‌ పై కరోనా వ్యాక్సిన్ అని రాసి ఉంది. ఇంజక్షన్ సిరంజిలో 10 శాతం లోడ్ చేశారు. తన తొలి రెండు సినిమాల్లోనూ వినూత్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. ఈ మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని అంతా భావిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా షూటింగ్ ప్రశాంత్ గత ఐదు రోజుల నుండి సారధి స్టూడియోలో షూట్ చేస్తున్నాడు. ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ చేస్తున్నాడట. అయితే తన సినిమా కాస్ట్ అండ్ క్రూ.. అందరికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి.. పూర్తిగా టీమ్ అంత కరోనా ఫ్రీ అని తెలిసాకే షూటింగ్ ప్రారంభం చేసాడట. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల మేరకే అన్నీ జాగ్రత్తలు వహిస్తూ షూటింగ్ కొనసాగిస్తున్నాడట. అయితే ఇప్పటివరకు 40% షూటింగ్ పూర్తయిందని సమాచారం.
Tags:    

Similar News