అందరూ బిజీగా ఉన్నా ఆ హీరోయిన్లకు మాత్రం ఆఫర్స్ రావడం లేదు..!

Update: 2020-12-12 13:58 GMT
కరోనా నేపథ్యంలో కొన్ని నెలల పాటు షూటింగ్స్ కి దూరంగా ఉన్న నటీనటులు టెక్నిషియన్స్ ఇప్పుడు బిజీగా మారిపోయారు. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అయ్యాక రోజుకో కొత్త సినిమా ఓపెనింగ్ జ‌రుగుతోంది. దీంతో అందరికీ కావల్సినంత పని దొరుకుతుంది. ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ వారికి కూడా ఖాళీ లేనంత‌గా ఇండ‌స్ట్రీలో పని ఉంది. చాలా సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నాయి.. ఒక్కో హీరో మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇండస్ట్రీలో కొన్నాళ్ళు ఓ వెలుగు వెలిగిన పలువురు హీరోయిన్లు మాత్రం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారని తెలుస్తోంది. ప్ర‌గ్యా జైస్వాల్ - రెజీనా - అవికా గౌర్ - హెబ్బా ప‌టేల్ - రెజీనా కసాండ్రా - మెహ్రిన్ ఇలా చాలా మంది హీరోయిన్ల‌కి ఇప్పుడు స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేదని టాక్ నడుస్తోంది.

అయితే పేరు మోసిన హీరోయిన్ల‌కి సరైన అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి ఏకైక కారణం వీరి పారితోషికంతో పాటు వీరు మెయింటనెన్స్ కి అయ్యే ఖ‌ర్చే అని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. హీరోయిన్ సెట్స్ కి వ‌చ్చిదంటే రోజుకి నిర్మాత‌కి దాదాపుగా ల‌క్ష రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి వస్తోందట. ఇంత భారం మీడియం రేంజ్ నిర్మాత‌లు కూడా మోయ‌లేక‌నే వీరిని సినిమాల్లోకి తీసుకోవ‌డం లేద‌ని క్యాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. వీరందరూ ఈ విష‌యం మీద దృష్టి పెట్టి నిర్మాత‌ల‌కు త‌గ్గ‌ట్లుగా డీల్స్ చేస్తే ఈ బ్యూటీస్ కూడా మ‌ళ్లీ సినిమాలతో బిజీ అవుతారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News