• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ రీమేక్ సినిమా కన్నడలో...

ఆ రీమేక్ సినిమా కన్నడలో రేమేడ్ కానుందా...?

By - Tupaki Desk
Update: 2020-04-10 10:50 GMT
'క్షణం' - 'గూఢాచారి' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ నటించిన మరో థ్రిల్లర్ మూవీ 'ఎవరు'. ఈ చిత్రానికి అడవి శేష్ స్వయంగా స్టోరీని అందించాడు. రెజీనా హీరోయిన్ గా నటించింది. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమాతో వెంకట్‌ రామ్‌ జీ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2007లో హాలీవుడ్‌ లో రిలీజ్‌ అయిన 'ది ఇన్విజిబుల్‌ గెస్ట్' సినిమాకు రీమేక్‌ గా 'ఎవరు' తెరకెక్కింది. ఇదే సినిమాను బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ - తాప్సీల కాంబినేషన్‌ లో 'బద్లా' పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ ఓ మహిళ హత్య విషయంలో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ను అరెస్ట్ చేస్తే - ఇండియన్‌ రీమేక్‌ లలో మాత్రం ఓ వ్యక్తి హత్య విషయంలో ఆమె గర్ల్‌ ఫ్రెండ్‌ ను అరెస్ట్ చేసినట్టుగా మార్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయబోతున్నారు. అడవి శేష్ రోల్ శాండల్ వుడ్ యంగ్ హీరో దిగత్ పోషిస్తుండగా రెజీనా రోల్ ఎవరు పోషించబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 'ఎవరు' సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ అందరు దాదాపు ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నారని సమాచారం. రీమేక్ అయిన అన్ని భాషల్లో మంచి విజయం సాధించిన ఈ సినిమా కన్నడలో ఎలాంటి ఫలితాన్ని చూడబోతుందో చూడాలి.

అడవి శేష్ ప్రస్తుతం మహేష్ బాబు నిర్మిస్తున్న 'మేజర్' సినిమా లో నటిస్తున్నాడు. టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా అడుగు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. వారికి సినిమా మీద ఉండే ఫాషన్ వాళ్ళని ఆ రేంజ్ కి తీసుకొచ్చింది. అడవి శేష్ కూడా అదే కోవకి చెందుతాడు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నాడు. ఈ హీరో టాలీవుడ్ కి వచ్చి చాలా ఏళ్ళైనప్పటికి గత రెండు మూడేళ్ళుగా వచ్చిన సినిమాలతోనే మంచి ఫేంని సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్ కాకపోయినప్పటికి మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇప్పుడున్న కొందరు యంగ్ హీరోలతో పొల్చుకుంటే అడవి శేష్ చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ - స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది. అలాగే క్రియోటివ్ థాట్స్ తో మంచి స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకోవడం లో అడవి శేష్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈయనతో సినిమా తీస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Adavi Sesh 
  • Evaru Movie 
  • Remake In Kannada 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS