బికినీ బీచ్ లో పెట్ డాగ్ ‌తో `సాహో` గాళ్ ని చూశారా?

Update: 2020-12-24 04:55 GMT
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంట‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ `సాహో`లో కనిపించిన ఈవ్ లిన్ శర్మ అంద‌చందాలు స్పెల్ బౌండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ భామ ఇటీవ‌ల‌ ఇన్ స్టాని హీటెక్కిస్తోంది. తాజాగా  తన ఇన్ స్టాగ్రామ్ లో వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేసింది. ఇందులో శర్మ గాళ్‌ తన పెంపుడు కుక్క కోకోతో ఆట‌లాడుకుంటోంది. ఇక బికినీ లో బీచ్ వెంబ‌డి ప‌రిగెత్తుతూ నానా ర‌చ్చా చేసిందని తాజా ఫోటో చెబుతోంది. బీచ్ లో మోనోకిని టోపీని ధ‌రించి ఆర‌బోత‌తో సూపర్ హాట్ గా కనిపిస్తోంది. ఈ వీకెండ్ ఒక సెలవుదినాన్ని పూర్తిస్థాయిలో ఇలా ఆస్వాధించింది ఈవ్ లిన్.

ఇంత‌కీ ఈ భామ మూలాలేవి? అన్న‌ది వెతికితే.. త‌ను జర్మన్ మోడల్ కం   న‌టి. జర్మనీ- ఫ్రాంక్ ఫర్ట్ లో పంజాబీ తండ్రి - జర్మన్ తల్లికి జన్మించింది. అమెరికన్ చిత్రం టర్న్ లెఫ్ట్ తో 2006 లో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. తరువాత `ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్` చిత్రంతో బాలీవుడ్ ‌లోకి ప్రవేశించింది. `యే జవానీ హై దీవానీ`తో విజ‌యం అందుకుంది. ఇందులో రణబీర్ కపూర్ హీరో. ఇందులో ‘ఆజ్ బ్లూ హై పానీ’ పాటలో హాటెస్ట్ అవ‌తారంతో మెరుపులు మెరిపించింది. నీలి సముద్రపు నీటిలో బికినీలో అగ్గి రాజేస్తుంది.
Tags:    

Similar News