ఈషా బానే కవర్ చేసిందే

Update: 2018-03-23 10:55 GMT
గత ఏడాది చివర్లో ఓ హాలీవుడ్ నిర్మాత వేధింపుల బండారం లేడి యాక్టర్స్ ఎలా బయటపెట్టారో అందరికి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కూడా కొంత మంది హీరోయిన్స్ ఇష్టం వచ్చినట్టుగా మీటూ అంటూ వారికి ఎదురైనా చేదు అనుబవాలను గురించి బయటపెట్టారు. అందుకు సంబందించిన వార్త దేశమంతటా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సౌత్ లో మాత్రం స్టార్ హీరోయిన్స్ పెద్దగా ఆ విషయాల గురించి పెట్టించుకోలేదు. ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు.

టాలెంట్ ని బట్టి అవకాశాలు వస్తాయని కొందరంటే పక్కలో పడుకుంటేనే పట్టించుకుంటారు అని మరికొంతమంది ఆరోపణలు చేశారు. ఇక రీసెంట్ గా ఇప్పుడిపుడే అడుగులు వేస్తోన్న  తెలుగు హీరోయిన్స్ శ్రీ రెడ్డి మాధవిలతలు డైరెక్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వారికి ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకోవడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

అయితే మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా మాత్రం ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసిన ఈ బ్యూటీకి ప్రస్తుత వివాదాల గురించి ప్రశ్న ఎదురైంది. అయితే ఈషా మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వకుండా నో కామెంట్స్ అంటూ పొలిటీషియన్స్ ఫార్ములాను వాడేసింది. ఈషా నటించిన సినిమాలు ఓ విధంగా బాగానే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అ! సినిమాలో చేసిన క్యారెక్టర్ విమర్శకుల నుంచి పాజిటివ్ కామెంట్ అందుకునేలా చేసింది. 
Tags:    

Similar News