ఇంత సంపాదిస్తున్నా.. ఇంకా అద్దె కొంప‌లోనే ఉంటున్న టాప్ హీరోయిన్!

Update: 2021-02-08 16:30 GMT
సోష‌ల్ మీడియాల్లో అందాల భామ‌లంతా యోగా జిమ్ క్లాసుల‌తో పాటు వంట‌కాల క్లాసులు.. మేక‌ప్ క్లాసులు కూడా చెబుతున్న సంగ‌తి తెలిసిందే. స‌న్నీలియోన్ స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య సాధ‌నాల గురించి ప్ర‌చారం చేస్తోంది.ఇప్పుడు స్టార్ స్ట‌క్ కి రైవ‌ల్రీ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేస్తూ బ్యాడ్ గాళ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీట్ పెంచేస్తోంది. ల‌వ్ క‌ల‌ర్ బార్ అనే ప్ర‌ఖ్యాత బ్రాండ్ కి ఈ అమ్మ‌డు ప్ర‌చారం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా మేక‌ప్ ఎలా చేయాలి? అన్న‌ది ఇదిగో ఇలా చేసి చూపిస్తోంది. డ్రీమ్ గాళ్ అవ్వాలంటే ఇలా చేయాలి! అంటూ క్లాస్ తీస్కుంటోంది.

స‌ద‌రు బ్రాండ్ ప్ర‌మోష‌నల్ వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ గా మారాయి. ఇక జాకీ ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ లో ఎంతో స్పెష‌ల్ గా కనిపిస్తోంది. జాకీ ఇచ్చే టిప్ మాటేమో కానీ త‌న చంద‌మామ రూపానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బ్యాడ్ గాళ్ అన్ లిమిటెడ్ ట్రీట్ కి కంటిపై కునుకు ప‌ట్ట‌ని స‌న్నివేశంలో ప‌డిపోతున్నారు.కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టిస్తున్న `సిర్కస్` సెట్లో  ఉంది. సైఫ్ అలీ ఖాన్ - అర్జున్ కపూర్ - యామి గౌతమ్ ల‌తో క‌లిసి నటిస్తున్న భూత్ పోలీస్ షెడ్యూల్ ను జాకీ పూర్తి చేసింది. త‌దుప‌రి బచ్చన్ పాండే .. కిక్ 2లో కనిపిస్తుంది.

తాజాగా జాక్విలిన్ కొత్త ఇంటికి మారింద‌న్న స‌మాచారం అందింది. అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా గ‌తంలో నివాసం ఉన్న‌  ముంబై ఇంటికి మారింద‌ట‌. ఈ ఇంటి విలువ‌ రూ. 7 కోట్లు. జాక్విలిన్ గత కొన్నేళ్లుగా ముంబైలోని బాంద్రాలో అద్దెకు నివసిస్తోంది. 2018 లో నిక్ జోనాస్ తో క‌లిసి పీసీ నివ‌సించిన ఇంట్లోకి అద్దెకి దిగింద‌ట‌. అన్న‌ట్టు ఓవైపు సినిమాల‌తో మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో అంత భారీగా ఆర్జిస్తూ ఇంకా అద్దె కొంప‌లోనే ఉంటోందేమిటి జాకీ.. ప్ర‌స్తుతం అభిమానుల ధ‌ర్మ సందేహ‌మిది.
Tags:    

Similar News