• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విష్ణు వెనక్కి తగ్గుతాడా?

విష్ణు వెనక్కి తగ్గుతాడా?

By - Tupaki Desk
Update: 2015-07-13 01:40 GMT
అనుకున్నదే అయింది. అల్లరి నరేష్‌ సినిమా 'జేమ్స్‌బాండ్‌' ఈ శుక్రవారం విడుదల కావట్లేదు. 'బాహుబలి' విడుదలకు ముందు ఈ నెల 17న విడుదల అని ఘనంగా ప్రకటించుకున్నారు కానీ.. ప్రస్తుతం బాహుబలి ప్రభంజనం చూశాక మాత్రం వెనక్కి తగ్గక తప్పట్లేదు. ఈ సినిమాను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్లు  ప్రకటించారు. అప్పటికి బాహుబలి ప్రభంజనం కొంత తగ్గుతుంది, థియేటర్లు కూడా కొంచెం ఖాళీ అవుతాయి కాబట్టి ఇబ్బంది లేకపోవచ్చు. ఐతే అల్లరోడు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసేసుకున్నాడు కాబట్టి ఓకే.. కానీ అదే తేదీకి రావాలనుకుంటున్న మంచు విష్ణు సంగతే తేలాల్సి ఉంది.

బాహుబలి రావడానికి వారం ముందు తన 'డైనమైట్‌' సినిమాను విష్ణు రిలీజ్‌ చేస్తాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని.. 17న లేదంటే 24న తన సినిమా విడుదలవుతుందని ప్రకటించాడు విష్ణు. ఐతే 17న విడుదల చేసే పరిస్థితి లేదని అతడికీ అర్థమైంది. మరి 24న జేమ్స్‌బాండ్‌కు పోటీగా 'డైనమైట్‌'ను తెస్తాడో లేదో చూడాలి. రెండు సినిమాలకూ అంటే థియేటర్లు దొరక్కపోవచ్చు. ఎందుకంటే అప్పటికి బాహుబలి జోరు కొంచెం తగ్గొచ్చు కానీ.. మెజారిటీ థియేటర్లలో ఆడుతుంటుంది. కావాల్సినన్ని థియేటర్లు దొరకవు. అలాంటపుడు రెంటిలో ఒక్కదానికే థియేటర్లు అందుబాటులో ఉంటాయి. మరి ఏది వాయిదా పడుతుంది. ఏది విడుదలవుతుందో చూడాలి.
Tags:    
  • manchu vishnu 
  • Dynamite Movie 
  • Manchu vishnu Dynamite 
  • telugu NEws 

Similar News

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

Copyright @2026

Powered by Blink CMS