బన్నీ కోసం మాస్ ఐటమ్ సాంగ్ రెడీ చేస్తున్న డిఎస్పీ..
రీసెంట్ గా 'అల వైకుంఠపురంలో' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్క చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప టైటిల్ పోస్టర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఊరమాస్ రగ్డ్ లుక్కులో బన్నీ కనిపించి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఐదు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. అయితే కథ, కథనం గురించి పక్కన పెడితే సుక్కు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ విషయం పై సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాను సుక్కు డిఫరెంట్ జోనర్ లో రూపొందిస్తున్నాడు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధం అవుతున్నాడు. నేను నా శాయశక్తులా ఈ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బన్నీ పాత్ర మాత్రం హైలైట్ అవుతుంది. మా కాంబినేషన్ లో ప్రతిసారిలాగే ఈ సినిమాలో కూడా ఓ మాంచి ఐటమ్ సాంగ్ ఉంటుంది. అది ఓ రేంజ్ లో ఉండబోతుందని" చెప్పాడు. అయితే మాస్ మ్యూజిక్ తో పాటు మంచి లిరిక్స్ అందించినట్లు సమాచారం.