డ్రగ్స్ కేసు: పరారీలో దీపికా పదుకునే మేనేజర్..?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. అలానే కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో అతన్ని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అర్జున్ రామ్ పాల్ గర్ల్ ఫ్రెండ్, 'ఊపిరి' ఫేమ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని కూడా అరెస్ట్ చేసారు. నటి సప్నా పబ్బాకు సమన్లు జారీ చేసింది. ఇంతకముందు ఇదే కేసులో స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే - సారా అలీఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ - శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు. వీరితో పాటు టాలెంట్ మేనేజర్ జయ సాహా మరియు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను కూడా ఎన్సీబీ ప్రశ్నించింది. అయితే ఇటీవల ముందస్తు సమాచారం మేరకు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు చేసారని తెలుస్తోంది.
ముంబై వెర్సోవాలోని కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో 1.7 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు మరియు రెండు సీసాల సీబీడీ ఆయిల్ లభించినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే వెల్లడించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలని దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దాడుల తర్వాత ఆమె జాడ కనబడకపోవడంతో.. కరిష్మా ఇంటి తలుపులకు అధికారులు నోటీసు అంటించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు జరిపిన దగ్గరి నుంచి కరిష్మా ప్రకాష్ ఎవరికీ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. బుధవారం ఎన్సీబీ ఎదుట హాజరవాల్సి ఉండగా ఆమె గైర్హాజరయ్యారని.. దానికి గల కారణాలను ముందుస్తుగా ఏజెన్సీకి వెల్లడించలేదని నేషనల్ మీడియా తెలిపింది. రెండు రోజులు వేచి చూసి మరోసారి ఎన్సీబీ అధికారులు కరిష్మా కు నోటీసులు జారీ చేస్తారని తెలుస్తోంది.