మరుదనాయగం రహస్యాలు చెప్పిన కమల్
కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ `మరుద నాయగం`. ఈ ప్రాజెక్ట్ ని 1997లో అత్యంత భారీ స్థాయిలో క్వీన్ ఎలిజబెత్ II సమక్షంలో ప్రారంభించారు కమల్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాపై చర్చ సాగిందంటే అర్థం చేసుకోవాలి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కమల్ స్వీయ నిర్మాణంలో ఆయనే దర్శకుడిగా మొదలుపెట్టారు. స్క్రిప్ట్ ని కూడా కమల్ హాసన్ రాశారు. బడ్జెట్ అప్పట్లోనే 30 కోట్లుగా అనుకున్నారు. ఇది దేశంలోనే తొలి భారీ బడ్జెట్ సినిమాగా రికార్డులకెక్కింది కూడా.
అయితే అట్టహాసంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. చాలా కాలం తరువాత కమల్ తాత్కాలికంగా ప్రాజెక్ట్ ని మళ్లీ పునః ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా వుంటే గత కొన్ని సీజన్ లుగా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తాజా సీజన్ మొదలైంది. ఈ నేపథ్యంలో షోలో కమల్ `మరుదనాయగం` గురించి పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు.
వీకెండ్ ఎపిసోడ్ లో కమల్ వనమామలై రాసిన `తమిళర్ నాటు పడల్ గల్` అనే పుస్తకం గురించి మాట్లాడారు. దేవర్ మగన్ చిత్రంలోని ఇంజి ఇడుప్పళగి.. పాటలోని `మరక్క మానమ్ కూడుతిళ్లై .. అంటూ సాగే పదాలు తన ఫేవరేట్ అని చెప్పారు. ఆ తరువాత ఆ పాట రచయిత రాసిన `కంసాకిపు సందై` పాటను తాను చూశానని కమల్ వెల్లడించాడు. ఆ పాటలోని కథనాయకుడు `మరుదనాయగం`. కమల్ కలల ప్రాజెక్ట్ ఈ పాత్ర ద్వారా ప్రేరణ పొంది `మరుదనాయగం`ని తెరకెక్కించాలని కమల్ ప్లాన్ చేశారు. 18వ శతాబ్దపు యోధుడు మరుదనాయగం.
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపనీ మద్రాస్ ఆర్మీ కమాండెంట్ అయిన మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ గా మారాడు. ఆ తరువాత భారత స్వాతంత్య్రం కోసం వీరోచిత పోరాటం చేశాడు. ఈ కథని ప్రపంచానికి తెలియజెప్పాలనే సంకల్పంతో కమల్ సినిమాగా చేయాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఈ మూవీ కోసం కీలక పాత్రల్లో దివంగత నటుడు అమ్రిష్ పురితో పాటు నసీరుద్దీన్ షా.. నాజర్.. విష్ణువర్ణన్.. సత్యరాజ్.. పశుపతి..లని తీసుకున్నారు. సంగీతం ఇళయరాజాకి అప్పగించారు. మరుదనాయగం ఎప్పటికీ పూర్తి కాని సినిమాగా హిస్టరీలో నిలిచిపోవడం కమల్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది.