మహేష్ ఫ్యాన్స్ కి డ‌బుల్ ట్రీట్..!

Update: 2021-07-22 11:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు 'ఆగస్టు 9' వచ్చిందంటే సోషల్ మీడియాలో పెద్ద పండుగగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు మహేష్ పుట్టినరోజు. మరికొన్ని రోజుల్లో రానున్న తమ ఫేవరేట్ హీరో బర్త్ డే కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కామన్ డీపీలు - హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్ - ఫేస్ బుక్ - ఇన్స్టాగ్రామ్ లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా తన సూపర్ ఫ్యాన్స్ కోసం ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. తన 46వ బర్త్ డే సందర్భంగా వారికి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గతేడాది 'సరిలేరు నీకేవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. లాస్ట్ ఇయర్ మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ పుట్టినరోజు నాడు 'స‌ర్కారు వారి పాట' ఫ‌స్ట్ గ్లిమ్స్ వీడియో మరియు ఓ పోస్టర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

అలానే '#SSMB28' సినిమాని కూడా అదే రోజున ఓపెనింగ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై రాధాకృష్ణ‌ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటుందని చిత్ర బృందం చెబుతూ వస్తోంది.

అయితే త్రివిక్ర‌మ్ ఈ సినిమా కోసం త‌నకు అచ్చువ‌చ్చిన ప‌ద్ధ‌తినే ఫాలో కాబోతున్నాడట. పాత తెలుగు సినిమాలోని ప్లాట్ తీసుకుని.. దానికి న్యూ ఏజ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈసారి మ‌హేశ్ తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌డానికి ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంతేకాదు దీనికి త‌న శిష్యుడు, 'భీష్మ' డైరెక్టర్ వెంకీ కుడుముల హెల్ప్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఏదేమైనా 'అతడు' 'ఖలేజా' సినిమా తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Tags:    

Similar News