వచ్చే ఏడాదంతా ఆ ఇద్దరు హీరోలదేనా..?
కరోనా వైరస్ టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని భారీ నష్టాల్లోకి నెట్టేసిందని చెప్పాలి. ఎన్నో విడుదలకు సిద్దమైన స్టార్ హీరోల ప్లాన్స్ అన్నీ గంగలో కలిపింది. 2020లో ఒకరిద్దరు మినహా ఏ స్టార్ హీరో తమ సినిమా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. పవర్ స్టార్ చాలా గ్యాప్ తీసుకొని నటించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావడంతో ఈ సినిమా త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య ఈ ఏడాది దసరా వరకు వచ్చే అవకాశం ఉంది. మరి డార్లింగ్ ప్రభాస్-రాధాకృష్ణల పీరియాడిక్ లవ్ స్టోరీ ఈ ఏడాది రావడం కష్టమే అనిపిస్తుంది కానీ చూడాలి ఏదైనా త్వరగా ప్లాన్ చేస్తారేమో..
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్-బన్నీల పుష్ప 2021 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ వేసారట. ఇలా స్టార్ హీరోలంతా కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి ఆలస్యంగా రానున్నారు. ఈ నేపథ్యంలో 2021లో ఎన్టీఆర్ - పవన్ మాత్రమే తమ సినిమాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బన్నీ, ప్రభాస్, చరణ్, మహేష్ వంటి స్టార్ హీరోల ప్రస్తుత సినిమాలు కాకుండా మరో మూవీ 2021లో వచ్చే సూచనలు కనిపించడం లేవు. ఎన్టీఆర్ నుండి ఆర్ఆర్ఆర్ తో, త్రివిక్రమ్ తో సినిమా ఖచ్చితంగా విడుదల కానుందట. అలాగే పవన్ క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ 2021 ఏడాది ప్రారంభంలో, హరీష్ శంకర్ సినిమా ఏడాది చివరిలోపు రెడీ అవుతుందట. మహేష్ ఇంకా కొత్త సినిమా ప్రకటనే చేయలేదు. కాబట్టి 2021లో ఎన్టీఆర్, పవన్ మాత్రమే రెండు చిత్రాలు విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి.