ట్రైలర్ చూసి ఆ సినిమా పై అంచనాలు వేయొద్దు: నెటిజన్లు ఫైర్

Update: 2021-06-03 04:30 GMT
కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఒకసారి థియేటర్లు మూతపడి మళ్లీ ఓపెన్ అయ్యాక కూడా సినీప్రేక్షకులు ఇంకా డిజిటల్ ప్లాట్ ఫామ్ లనే ఇష్టపడుతున్నారు. అంటే లాక్డౌన్ సమయంలో ఓటిటిలు జనాలపై ఎంతటి ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోవచ్చు. కొత్త సినిమాల దగ్గర నుండి వెబ్ సిరీస్ ఇలా అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో జనాలు ఓటిటిలకు అలవాటు పడ్డారు. ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటి స్ట్రీమింగ్ వైపు జనాలు మళ్లడం కాదు. ఏకంగా సినీతారలే ఓటిటి వైపు మొగ్గుచూపడం గమనార్హం. ఇప్పటికే థియేటర్స్ తెరుచుకున్నాక కూడా భారీ సినిమాలు ఓటిటిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇప్పుడు అప్ కమింగ్ హీరోల దగ్గర నుండి స్టార్స్ వరకు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా డిజిటల్ స్ట్రీమింగ్ వైపు ఇంటరెస్ట్ చూపుతున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ గోలంతా తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలు ఓటిటిలో ప్రదర్శితం కాబోతున్నాయి. వీటి ఫలితం బట్టి ముందుముందు చాలా సినిమాలు ఇదే బాటపట్టే అవకాశం ఉంది. తాజాగా ధనుష్ నటించిన 'జగమే తంత్రం' కూడా డిజిటల్ స్ట్రీమ్ కాబోతుంది. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాఫియా యాక్షన్ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించడమే కాకుండా సినిమా ట్రైలర్ కూడా వదిలారు. ప్రస్తుతం జగమే తంత్రం ట్రైలర్ ఆసక్తికరంగా సినిమా పై అంచనాలు పెంచుతున్నప్పటికి సినీ వర్గాలలో సోషల్ మీడియాలో సినిమా పై పలు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఇదివరకు మాఫియా ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో సూపర్ స్టార్ రజినీ కబాలి అనే సినిమా చేసారు. ఇప్పుడు జగమే తంత్రం సినిమా ట్రైలర్ చూస్తే కూడా అదే స్టోరీ లైన్ గుర్తుకు వస్తుందంటూ పలు కథనాలు చెబుతున్నాయి. కానీ పుకార్లకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో నేటిజన్లు కూడా ఈ ట్రైలర్ పై కామెంట్స్ స్పందిస్తున్నారు. ట్రైలర్ చూసి సినిమా పై అంచనాకు రావొద్దంటూ కోరుతున్నారు. మరి చూడాలి ధనుష్ మరోసారి విశ్వరూపం చూపిస్తాడేమో.. ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News