• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాట్ హాట్ ఫోటోషూట్స్...

హాట్ హాట్ ఫోటోషూట్స్ ఆశించిన ఆఫర్స్ అందించేనా..?

By - Tupaki Desk
Update: 2022-08-04 00:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కొదవ ఉండదు. వారానికో కొత్త కథానాయి పరిచయం అవుతూ ఉంటుంది. అలానే ఇతర భాషల్లో మెరిసిన భామలకు కూడా మన ఫిలిం మేకర్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ స్టార్ స్టేటస్ అందుకోవాలని ఆశ పడుతుంటారు కానీ.. కొందరికి మాత్రమే అలాంటి అవకాశం దక్కుతుంది.

గ్లామర్ ఫీల్డ్ లో రాణించడం అంటే అంత ఈజీ కాదు. అందం - అభినయం - టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉన్న హీరోయిన్లు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇవనీ ఉన్నా సక్సెస్ లేకపోతే మాత్రం సినిమా అవకాశాలకు దూరం కావాల్సి ఉంటుంది.

అయితే ఓటీటీల హవా మొదలైన తర్వాత అందరికీ చేతినిండా ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. వెబ్ మూవీస్ మరియు ఒరిజినల్ సిరీసులు కావాల్సినన్ని ఆఫర్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఛాన్సులు తగ్గిపోయిన హీరోయిన్లకు ఓటీటీలు వరంగా మారాయని చెప్పాలి.

డిజిటల్ స్క్రీన్ మీద సత్తా చాటి ఈ క్రమంలో మళ్లీ సినిమా ఆఫర్స్ అందుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. చిన్న మీడియం రేంజ్ హీరోల సరసన నటించే అవకాశాలు  చేజిక్కించుకుంటున్నారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు కేవలం పెద్ద ప్రాజెక్ట్స్ లో మాత్రమే నటిస్తామంటూ వచ్చిన ఆఫర్స్ ను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో అనేకమంది హీరోయిన్లు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా బోల్డ్ పిక్స్ మరియు స్పైసీ చిత్రాలను పోస్ట్ చేస్తూ సూపర్ వైల్డ్ గా మారుతున్నారు. వీరంతా ఈ మధ్య సినిమా అవకాశాలకు దూరంగా ఉన్నవారే కావడం గమనార్హం.

వీరు ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందాల ఆరబోతతో అవకాశాలు రాబట్టాలని చూస్తున్నారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. నిజానికి గ్లామరస్ చిత్రాలను చూసిన తర్వాత అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

కాకపోతే వీరంతా పెద్ద హీరోల చిత్రాల్లో నటించాలనే ఆశతో ఆ ప్రాజెక్ట్స్ కి ఒప్పుకోవడం లేదట. హాట్ పిక్చర్స్ తో నెట్టింట రచ్చ చేస్తున్న హీరోయిన్లు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు. మరి ఈ హాట్ హాట్ ఫోటోషూట్స్ వారికి ఆశించిన ఆఫర్స్ అందిస్తాయా లేదా అనేది చూడాలి.
Tags:    
  • Tollywood 
  • Heroines 
  • Glamour 
  • Ott 
  • DigitalScreen 
  • Photoshoot 
  • SocialMedia 
  • Instagram 
  • Offers 
  • HotPhotoshoot 
  • Movienews 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS