రామ్ చరణ్ జి-షాక్ వాచ్ ఖరీదెంతో తెలుసా?
ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే రామ్ చరణ్ సింప్లిసిటీనే ఎక్కువ ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని మెగా పవర్ స్టార్ తూ.చ తప్పక పాటిస్తాడు. డ్రెస్సింగ్ సెన్స్ .. ఎంచుకునే దుస్తులు .. వాచ్ లు వగైరా వగైరా మ్యాటర్స్ లో అనవసర హంగామా ఏమాత్రం చూపించడు.
నిన్నటిరోజున నిహారిక నిశ్చితార్థ వేడుకలో చరణ్ అంతే సింపుల్ గా కనిపించారు. సతీమణి ఉపాసనా సమేతుడై అతడు పోటోలకు ఫోజులిచ్చాడు. అయితే ఈ ఫోటో సెషన్స్ లో కెమెరా కళ్లన్నీ ఓ చోటనే ఫోకస్ చేశాయి. చరణ్ ధరించిన జి షాక్ కాసియో GM-5600B-3DR గ్రీన్ రెసిన్ మెన్స్ వాచ్ అందరి దృష్టిని తనవైపే తిప్పేసుకుంది. యూత్ కి పిచ్చిగా నచ్చేసే బ్రాండ్ ఇది. దీంతో సోషల్ మీడియాల్లో ఆ వాచ్ ఫోటోని వైరల్ గా షేర్ చేస్తున్నారు.
ఇంతకీ ఈ వాచ్ ఖరీదు ఎంత? అన్నది ఆరా తీస్తే .. సుమారు రూ.14000 ఉంటుందని తెలుస్తోంది. ఇంతకంటే ఖరీదైన బ్రాండెడ్ వాచ్ లు ఎన్ని ఉన్నా జి-షాక్ మోడల్ యూత్ ఫుల్ కాబట్టి ఫోకస్ కూడా ఎక్కువే. ఇటీవల రానా పెళ్లి వేడుకలోనూ ఈ వాచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక చెర్రీకి ఖరీదైన స్పోర్ట్స్ కార్ లు ఉన్నాయి. అలాగని జూబ్లీ హిల్స్ ఖాళీ రోడ్లలో రైడ్ కి వెళ్లేది తక్కువే. నిహారిక పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవి అంతే సింపుల్ గా కనిపించగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఎంతో స్టైలిష్ డిజైనర్ డ్రెస్ లో కనిపించారు.