ఈ స్టార్ నటుడి ఫ్యామిలీ గురించి తెలుసా?
సుదీర్ఘ కాలంగా మలయాళ సినిమా పరిశ్రలో కొనసాగుతూ వస్తున్న జయరాం ఇటీవల తెలుగులో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. పలు డబ్బింగ్ సినిమాలతో చాలా కాలం నుండి తెలుగు వారిని అలరిస్తూ వస్తున్న ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. విలన్ గా సహజత్వం ఉట్టిపడేలా నటించడంతో పాటు ఆయన ఏ పాత్రలో అయినా కూడా ఈజీగా జీవించేయగలడు. భాగమతి మరియు అల వైకుంఠపురంలో సినిమాల్లో రెండు విభిన్న పాత్రలను పోషించిన ఈయన ఫ్యామిలీ గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జయరాం హీరోగా 1988 లో పరిచయం అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నటనలో కొనసాగుతూనే ఉన్నారు. 200 సినిమాలకు పైగా నటించిన జయరాం కు కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. ఇక జయరాం భార్య కూడా ఒకప్పటి మలయాళి హీరోయిన్. జయరామ్ భార్య పార్వతి మలయాళంలో ఏకంగా 70 సినిమాల్లో నటించింది. 1992లో జయరామ్ మరియు పార్వతిలు ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత పార్వతి ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. వీరికి ఒక బాబు పాప ఉన్నారు. బాబు కాళిదాస్ హీరోగా మలయాళంలో కొచు కొచు సంతోషమంగిల్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. కాలళిదాస్ బాల నటుడిగా కూడా మెప్పించాడు. బాల నటుడిగా జాతీయ అవార్డు దక్కంచుకున్న కాళిదాస్ ప్రస్తుతం హీరోగా స్టార్ డం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక జయరాం ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ చేయబోతున్న సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు.